Pooja Hegde Remuneration: కడపలో పూజా హెగ్డే డ్యాన్స్.. అందుకు పారితోషికం ఎంతో తెలుసా?
Pooja Hegde Remuneration: ఒక్కసారి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగాక వారి పారితోషికం పెరుగుతూనే ఉంటుంది తప్పా తగ్గేది లేదు. అగ్ర కథానాయికగా ముద్ర వేసుకున్న ముద్దుగుమ్మల సినిమాలు వరుసగా ప్లాప్ అయినా సరే వారి డిమాండ్ ఏమాత్రం తగ్గదు. అలా తాజాగా పూజా హెగ్డే పారితోషికం హాట్ టాపిక్‌గా మారింది.
Pooja Hegde Remuneration For Shopping: టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకుంది బ్యూటిఫుల్ పూజా హెగ్డే (Pooja Hegde). మాస్క్ అనే తమిళ సినిమాతో సినీ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈ సుందరాంగీ మొదట మోడలింగ్ బాటలో పయనించింది. మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో ఆకట్టుకుని పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించింది ముద్దుగుమ్మ పూజా హెగ్డే. అలా సినీ అవకాశాలను అందిపుచ్చుకుంది పూజా హెగ్డే.
పూజా హెగ్డే తెలుగులో డబ్ అయిన తమిళ చిత్రం మాస్క్ లో హీరోయిన్‌గా నటించింది. తర్వాత తెలుగులోకి అక్కినేని నాగ చైతన్య హీరోగా చేసిన ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత వెంటనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‍తో ముకుంద మూవీలో జత కట్టింది. మొదటి రెండు సినిమాల్లో పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటిఫుల్ అల్లు అర్జున్ డీజే మూవీతో గ్లామర్ ఒలకబోయడం ప్రారంభించింది. అనంతరం పెద్ద హీరోలతో నటించడం, అవి కాస్తా హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ రేంజ్‍కు ఎదిగింది పూజా హెగ్డే.
అయితే ఇటీవల పూజా హెగ్డే నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో ఆమె సినీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఆచార్య, బీస్ట్, కిసీ కి భాయ్ కిసి కీ జాన్, సర్కస్ మూవీస్ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ ఎఫెక్ట్‍తోనే మహేశ్ బాబు గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో మెయిన్ హీరోయిన్ అవకాశం పోగొట్టుకుందని టాక్ వినిపిస్తోంది. అయితే పూజా హెగ్డే సినిమాలు ప్లాప్‍గా నిలిచిన ఆమె డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని తాజాగా ఓ సంఘటన తెలియజేస్తుంది.
ప్రస్తుతం సినీ అవకాశాలు లేని పూజా హెగ్డే షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలతో బిజీగా ఉంది. తాజాగా కడపలోని ఓ షాపింగ్ మాల్‍ను పూజా ప్రారంభించింది. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా పోటెత్తారు. తర్వాత పూజా నటించిన సినిమా పాటలకు స్టెప్పులు వేసింది. ఇక ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్‍కు పూజా హెగ్డే రూ. 40 లక్షల పారితోషికం తీసుకుందని టాక్. కొన్నిగంటలు మాత్రమే గడిపిన పూజా హెగ్డే అంత మొత్తం డిమాండ్ చేసిందని అంటున్నారు. ఇదే కాకుండా ఏ షాపింగ్ మాల్‍కు అయినా పూజా వచ్చి రిబ్బన్ కట్ చేయాలంటే అక్షరాలా 40 లక్షలు డిమాండ్ చేస్తొందట.