Pooja Hegde Out : పూజా హెగ్డే కూడా ఔట్.. గుంటూరు కారం సినిమా పరిస్థితేంటి?
Pooja Hegde Out From Mahesh Babu Film : మహేష్ బాబు-త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ పై ఫ్యాన్స్ బాగా ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాలోని ముఖ్యమైనవారు బయటకు వచ్చేస్తున్నారు.
ఖలేజా సినిమా హిట్ కాకపోయినా.. సినిమాకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. మహేశ్ బాబు-త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి అతడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ క్రేజీ కాంబినేషన్ మ్యాజిక్ సినిమాలో కనిపిస్తుంది. అలాంటి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ తెగ పండగ చేసుకున్నారు. గుంటూరు కారం(Gunturu Karam) అని సినిమా పేరు కూడా అనౌన్స్ చేశారు. కానీ సినిమా చుట్టూ మాత్రం ఏదో ఒక వివాదం నడుస్తున్నట్టుగానే ఉంది. ఇప్పటికే ప్రాజెక్టు నుంచి మ్యూజిక్ డైరెక్టర్ థమన్(Thaman) తప్పుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే కూడా తప్పుకుంది.
దీంతో మహేశ్‌బాబు, త్రివిక్రమ్(Mahesh Babu-Trivikram)ల సినిమాలో కాస్టింగ్‌లో మార్పు రానుంది. డేట్ సమస్యల కారణంగా పూజా హెగ్డే(Pooja Hegde) వెనక్కు తగ్గినట్టుగా తెలుస్తోంది. గుంటూరు కారం గత కొన్ని నెలలుగా వివిధ కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. రిలీజ్ డేట్, సినిమా స్క్రిప్ట్, మ్యూజిక్ డైరెక్టర్‌లో కూడా మార్పులు చేశారు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి పూజా హెగ్డే తప్పుకోవడం హాట్ టాపిక్ అయింది. పూజా హెగ్డే ఈ చిత్రం నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లుగా సినీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.
గుంటూరు కారం షూటింగ్(Gunturu Karam Shooting) టైమ్‌లైన్‌లు మారుతూనే ఉన్నాయి. టీమ్ కొన్ని సన్నివేశాల కోసం షూట్ చేస్తోంది. తదుపరి షెడ్యూల్ కోసం ఒక టైమ్‌ఫ్రేమ్‌ని నిర్ణయించుకుంది. అయితే వివిధ సమస్యల కారణంగా అది మళ్లీ ఆలస్యం అయింది. ఇప్పటికే షూట్ చేసిన కొన్ని భాగాలు రీషూట్ మోడ్‌లోకి వచ్చాయి. స్క్రిప్ట్‌లో కూడా మార్పులు జరిగాయి. దీని కారణంగా కొంతమంది వెనక్కు తగ్గారు. ఏం చేయాలనే విషయంపై అనేక ఆలోచనల తర్వాత, పూజా హెగ్డే డేట్స్ సమస్యలతో బయటకు వచ్చిందని టాక్ నడుస్తోంది.
జూన్ నుండి డిసెంబర్ వరకు ఇతర చిత్రాలకు పూజా డేట్స్ ఇచ్చిందని చెబుతున్నారు. గుంటూరు కారం సినిమా చేస్తే.. ఇతర సినిమాలు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందని, అందుకే బయటకు వచ్చినట్టుగా అంటున్నారు. పూజా హెగ్డేతోపాటుగా.. సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ సినిమా నుంచి బయటకు వచ్చాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) ఈ సినిమాకు పని చేయనున్నాడని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, మరోవైపు అల్లు అర్జున్(Allu Arjun), త్రివిక్రమ్(Trivikram) ఈ ఏడాది చివర్లో ఒక సాలిడ్ ఎంటర్‌టైనర్‌తో మళ్లీ కలుస్తున్నారు. దీని గురించి ప్రకటన త్వరలో విడుదల కానుంది. వీరిద్దరు కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురం సినిమా వచ్చింది. పుష్ప 2(Pushpa 2) తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా త్రివిక్రమ్ తో కావడం విశేషం. అయితే గుంటూరు కారం కంటే.. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ఎక్కువగా ఆసక్తితో ఉన్నాడని కూడా కొంతమంది అంటున్నారు. అందుకే ఈ సినిమా చుట్టూ ఏదో ఒక వివాదం నడుస్తుందని కూడా పుకార్లు ఉన్నాయి. కానీ ఈ విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ కావాల్సిన గుంటూరు కారం.. ఇంకా క్యాస్టింగ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.