దుమ్ములేపుతున్న కూలీ మోనికా సాంగ్- గ్లామర్‌తో పూజా హెగ్డే మంటలు- డ్యాన్స్‌తో డామినేట్ చేసిన మలయాళ నటుడు- ఓ లుక్కేయండి!-pooja hegde monica song released and trending from rajinikanth coolie soubin shahir dominates with his dance ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  దుమ్ములేపుతున్న కూలీ మోనికా సాంగ్- గ్లామర్‌తో పూజా హెగ్డే మంటలు- డ్యాన్స్‌తో డామినేట్ చేసిన మలయాళ నటుడు- ఓ లుక్కేయండి!

దుమ్ములేపుతున్న కూలీ మోనికా సాంగ్- గ్లామర్‌తో పూజా హెగ్డే మంటలు- డ్యాన్స్‌తో డామినేట్ చేసిన మలయాళ నటుడు- ఓ లుక్కేయండి!

Sanjiv Kumar HT Telugu

సోషల్ మీడియాలో పూజా హెగ్డే మోనికా సాంగ్ దుమ్ములేపుతోంది. రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలోని పూజా హెగ్డే మై డియర్ మోనికా సాంగ్ నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆ సాంగ్‌లో మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ డ్యాన్స్ మూమెంట్స్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

దుమ్ములేపుతున్న కూలీ మోనికా సాంగ్- గ్లామర్‌తో పూజా హెగ్డే మంటలు- డ్యాన్స్‌తో డామినేట్ చేసిన మలయాళ నటుడు- ఓ లుక్కేయండి!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ బిగ్ సినిమాల్లో కూలీ ఒకటి. ఇక ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, మలయాళ పాపులర్ యాక్టర్ సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్ వంటి అగ్ర తారలు నటిస్తున్నారు.

పూజా హెగ్డే మోనికా సాంగ్

వీరితోపాటు బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ కెమియో చేయనుంది. కూలీ సినిమాలో పూజా హెగ్డే మోనికా సాంగ్‌లో మోనికా బెల్లూచి పాత్ర చేయనుందని సమాచారం. సుహాసిని, అనిరుధ్ పాడిన ఈ పాటకు ఇటాలియన్ నటి మోనికా బెలూచీ తన పేరు వాడుకోడానికి కూడా ఓకే చెప్పింది.

అయితే, తాజాగా కూలీ సినిమా నుంచి మోనిక సాంగ్‌ను రిలీజ్ చేశారు. మోనికా పేరుతో కూలీ మ్యూజిక్ ఆల్బమ్ నుంచి రెండో పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ శుక్రవారం (జులై 11) విడుదల చేశారు.

సోషల్ మీడియాలో వైరల్

పూజా హెగ్డే అందాలతో అదరగొట్టిన ఈ పెప్పీ ట్రాక్‌కు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పూజా హెగ్డే మై డియర్ మోనిక సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. రెడ్ డ్రెస్‌లో పూజా హెగ్డే గ్లామర్‌కు ఆడియెన్స్ అట్రాక్ట్ అవుతున్నారు.

దానికి మించి ఈ పాటలో డ్యాన్స్ చేసిన మలయాళ యాక్టర్ సౌబిన్ షాహిర్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సాంగ్‌లో సౌబిన్ షాహిర్ వేసిన డ్యాన్స్ మూమెంట్స్ అందరి మనసును దోచేస్తున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వందలాది మందితో

మోనిక సాంగ్‌లో పూజా హెగ్డే ఓ కార్గో షిప్‌పై వందలాది మందితో కలిసి డ్యాన్స్ చేసింది. పూజాతోపాటు సహా నటుడు సౌబిన్ షాహిర్ కూడా డ్యాన్స్ చేశాడు. అనిరుధ్ ఈ వీడియోను తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేస్తూ 'డాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేయడానికి #Monica ఇక్కడ ఉంది' అని పేర్కొన్నారు.

ఈ వీడియోకు నెటిజన్స్ నుంచి పలు విధాలుగా కామెంట్స్ వస్తున్నాయి. 'పూజా హెగ్డే తన ఎనర్జీ, డాన్స్‌తో పాటను డామినేట్ చేసింది' అని ఓ అభిమాని రాసుకొచ్చాడు. మరో అభిమాని 'పూజా హెగ్డేను ఇంతగా ఎప్పుడు ఇష్టపడలేదు. ఆమె చాలా గ్రేస్ ఫుల్‌గా చేసింది. సౌబిన్ కూడా చంపేస్తున్నాడు' అని మరొకరు కామెంట్ చేశారు.

డామినేట్ చేసిన సౌబిన్

సౌబిన్ షాహిర్ తన ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్‌తో డామినేట్ చేశాడని చాలా మంది అభిమానులు కూడా అంగీకరించారు. 'సౌబిన్ షాహిర్ డ్యాన్స్ నన్ను అబ్బురపరిచింది. ఇంత ఎనర్జీతో డ్యాన్స్ చేయడం ఎప్పుడూ చూడలేదు' అని ఒకరు అన్నారు. మరో అభిమాని 'సౌబిన్ ఊహించని పెర్ఫార్మెన్స్ షో దొంగ' అని కామెంట్ చేశాడు.

ఇదిలా ఉంటే, కూలీ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. కళానిధి మారన్ సన్ పిక్చర్స్ నిర్మించిన కూలీ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం