Pooja Hegde Lip Kiss: హీరోతో పూజా హెగ్డే లిప్ కిస్- ట్రెండింగ్‌లోకి బుట్టబొమ్మ- గొప్ప థెరపిస్ట్ అంటూ కామెంట్స్ (వీడియో)
Pooja Hegde Lip Kiss To Shahid Kapoor Trending: పూజా హెగ్డే లిప్ కిస్‌తో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దేవా సినిమాలో షాహిద్ కపూర్ పూజా హెగ్డే లిప్ కిస్ సీన్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు షాహిద్ కపూర్ గొప్ప థెరపిస్ట్ అంటూ పూజా హెగ్డే కామెంట్స్ చేసింది.
Pooja Hegde Lip Kiss To Shahid Kapoor Trending: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే చాలా కాలంగా సరైన హిట్ లేకుండా డీలా పడిన విషయం తెలిసిందే. దాదాపుగా వరుసగా ఐదు పరాజయాలతో పూజా హెగ్డే ఫెయిల్యూర్ హీరోయిన్ అనే టాక్ మూటగట్టుకుంది. అయితే, దానికి రెట్టించిన వేగంతో ఈ ఏడాది మూడు, నాలుగు సినిమాలు చేయనుంది పూజా హెగ్డే.

పూజా హెగ్డే లిప్ కిస్ వైరల్
అందులో ఒకటి అయిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవా జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమాలో హీరో షాహిద్ కపూర్‌కు లిప్ కిస్ ఇచ్చిన సీన్ సోషల్ వీడియోలో తెగ వైరల్ అవుతోంది. షాహిద్‌కు ఎంతో ప్యాషనేట్‌గా రొమాంటిక్‌గా పూజా హెగ్డే లిప్ కిస్ పెట్టిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ట్రెండింగ్‌లోకి పూజా హెగ్డే
ఫొటోలు, వీడియోలతో పూజా హెగ్డే లిప్ కిస్ వైరల్ కావడంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది పూజా హెగ్డే. బాలీవుడ్ మీడియా వర్గాల్లో పూజా షాహిద్ లిప్ కిస్‌కు సంబంధించిన వార్తలు జోరందుకున్నాయి. దాంతో ప్రస్తుతం పూజా హెగ్డే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే, దేవా రిలీజ్ కంటే ముందుగా పలు ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు పూజా హెగ్డే, షాహిద్ కపూర్.
40 నిమిషాల సమయంలో
ఈ క్రమంలో హెచ్‌టీ సిటీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే, హెచ్‌టీ సిటీ ఆఫీస్‌కు పూజా, షాహిద్‌కు 40 నిమిషాల టైమ్ పట్టిందని, ఆ టైమ్‌లో వారిద్దరు మాట్లాడుకున్న విషయం గురించి చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.
ఒట్టేసి చెబుతున్నా
"నేను ఒట్టేసి చెబుతున్నా. షాహిద్ గొప్ప థెరపిస్ట్. మేము నటులగా చేయాల్సిన సినిమాలు, అవకాశాల గురించి చాలా బాగా మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాం. అప్పుడు తనకు చెప్పాను నువ్ మంచి థెరపిస్ట్ అవుతావ్ అని. చివరలో దయచేసి ఇందుకు నాకు ఎలాంటి బిల్ పంపించొద్దు, ఎలాంటి ఛార్జ్ చేయకండి అని చెప్పాను" అని నవ్వుతూ తెలిపింది పూజా హెగ్డే.
ఓ సినిమా కావాలి
అప్పుడు షాహిద్ కపూర్.. "నేను అందరి ఫిల్మ్ మేకర్స్‌కు చెబుతున్నాను. ఇందాకా మేము వచ్చిన 40 నిమిషాల ప్రయాణంలో చూశాను. పూజా హెగ్డే నటించడానికి ఓ సినిమా కావాలి. ఆమెకు సినిమా ఛాన్స్‌లు ఇవ్వండి" అని షాహిద్ కపూర్ అన్నాడు. దాంతో మధ్యలోకి దూరిన పూజా హెగ్డే.. "ప్లీజ్ అతను చెప్పేది కాస్తా వినండి. మనకు ఒక గొప్ప యాక్టర్ ఉన్నారని అతను చెబుతున్నాడు" అని చెప్పింది.
పాజిటివ్ టాక్
ఇదిలా ఉంటే, రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన దేవా సినిమాకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి. షాహిద్ కపూర్ యాక్టింగ్ బాగుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతో దేవా బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా ఊపందుకున్నాయని టాక్. ఇదంతా చూస్తుంటే పూజా హెగ్డేకు చాలా గ్యాప్ తర్వాత హిట్ పడినట్లే అని తెలుస్తోంది.
సంబంధిత కథనం