Pooja Hegde Remuneration: రెమ్యూనరేషన్ పెంచేసిన పూజా హెగ్డే.. సూర్యతో సినిమాకు ఎంత తీసుకుంటున్నారంటే?
Pooja Hegde Remuneration: సూర్య 44 సినిమాలో హీరోయిన్‍గా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం పూజ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు బయటికి వచ్చాయి.
Pooja Hegde: కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య ఓ సినిమా చేస్తున్నారు. ఈ సూర్య44 (Suriya 44) మూవీ షూటింగ్ కూడా ఇటీవలే షురూ అయింది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందనుంది. కంగువ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. కార్తీక్ సుబ్బరాజుతో సినిమాను సూర్య షురూ చేశారు. ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‍గా నటిస్తున్నారు. అయితే, సూర్య 44 మూవీ కోసం తన రెమ్యూనరేషన్ పెంచేశారట పూజ.
పూజ రెమ్యూనరేషన్ ఇలా!
పూజా హెగ్డే ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే, సూర్య44 కోసం ఆమె ఈ ఫీజును కాస్త పెంచారట. ఈ సినిమా కోసం రూ.4కోట్ల రెమ్యూనరేషన్‍ను పూజా హెగ్డే అందుకుంటున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. సూర్యతో పూజకు ఇదే తొలి సినిమాగా ఉంది.
తెలుగులో స్టార్ హీరోయిన్‍గా వెలుగొందిన పూజా హెగ్డే రెండేళ్లుగా బాలీవుడ్‍పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. గతేడాది సల్మాన్ ఖాన్‍తో కిసి కా భాయ్.. కిసీ కి జాన్ మూవీతో నటించారు. ప్రస్తుతం షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న దేవ చిత్రంలోనూ పూజా హెగ్డే హీరోయిన్‍గా చేస్తున్నారు. ఇక, సూర్య44 చిత్రం చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ సౌత్‍కు తిరిగి వచ్చేస్తున్నారు.
సూర్య 44 గురించి..
సూర్యకు ఇది 44వ సినిమా కావడంతో ఆ ప్రాజెక్ట్ పేరుతోనే రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అండమాన్ నికోబార్‌లోని పోర్ట్ బ్లయర్‌లో చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీమ్ ఇటీవలే ఓ వీడియో పోస్ట్ చేసింది. ఫస్ట్ షాట్ అంటూ వెల్లడించింది. ఈ వీడియోలో వింటేజ్ లుక్‍తో సూర్య అదిరిపోయారు. సముద్రం ఒడ్డున కూర్చొని నవ్వుతూ.. ఆ తర్వాత ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్‍కు మారిన వీడియో ఆకట్టుకుంది. లాంగ్ హెయిర్, మీసాలతో సూర్య లుక్ డిఫరెంట్‍గా ఉంది.
జిగర్తాండ ఫేమ్, స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, సూర్య కాంబినేషన్ కావటంతో ఈ మూవీపై చాలా క్రేజ్ ఉంది. అందులోనూ పీరియడ్ యాక్షన్ డ్రామా కావటంతో ఆసక్తి మరింత పెరిగింది. సూర్య44 మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇస్తున్నారు.
సూర్య 44 చిత్రంలో జయరాం, జిజూ జార్జ్, కరుణాకరన్ కీరోల్స్ చేస్తున్నారు. ఈ విషయంపై కూడా అధికారిక ప్రకటన చేసింది మూవీ టీమ్. ఈ మూవీ షూటింగ్‍లో తాను పాల్గొన్నట్టు ఓ వీడియో కూడా పూజ పోస్ట్ చేశారు.
సూర్య44 చిత్రాన్ని భారీ బడ్జెట్‍తో పాన్ ఇండియా రేంజ్‍లో తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. స్టోన్ బీచ్ ఫిల్మ్స్, 2డీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకాలపై కార్తీక్ సుబ్బరాజ్, కార్తీకేయన్ సంతానం, కల్యాణ్ సుబ్రమణియం, సూర్య, జ్యోతిక ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఎలా ఉంటుందోననే ఆసక్తి చాలా ఉంది.