Pooja Hegde: డీ గ్లామర్ రోల్‌లో పూజా హెగ్డే.. 5 ఫ్లాప్‌ల తర్వాత చేతిలో 4 సినిమాలు.. స్ట్రాంగ్ లైనప్‌తో బుట్టబొమ్మ!
Pooja Hegde Look In Retro And Upcoming Movies: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే వరుసగా ఐదు ఫ్లాప్స్ చవిచూసింది. ఇప్పుడు త్వరలో సూర్య నటించిన రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు నాలుగు మూవీస్‌తో స్ట్రాంగ్ లైనప్‌తో 2025లో ముందుకు రానుంది బుట్టబొమ్మ.
Pooja Hegde Look In Retro And Upcoming Movies: తెలుగు బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుసగా ఐదు ఫ్లాప్స్ తర్వాత చేస్తున్న సినిమా రెట్రో. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో మూవీలో పూజా హెగ్డే డీ గ్లామర్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే, పూజా హెగ్డే 2025లో స్ట్రాంగ్ లైనప్‌తో ముందుకు రానుంది.
ఐరన్ లెగ్ అంటూ
టాలీవుడ్ బుట్టబొమ్మగా ఎంతో పేరు తెచ్చుకుంది హీరోయిన్ పూజా హెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. అయితే, గత కొంతకాలంగా పూజా హెగ్డేకు వరుస ఫ్లాప్‌లు దర్శనం ఇచ్చాయి. అలాగే, తనను ఐరన్ లెగ్ అంటూ కొన్ని సినిమాల నుంచి కూడా పక్కకు తప్పించినట్లు జోరుగా వార్తలు వచ్చాయి.
యావరేజ్‌గా నిలిచిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత పూజా హెగ్డే.. ప్రభాస్‌తో రాధేశ్యామ్, దళపతి విజయ్‌తో బీస్ట్, చిరంజీవి-రామ్ చరణ్ ఆచార్య సినిమాలు చేసింది. అయితే, అవన్ని బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. మధ్యలో ఎఫ్ 3 మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన పూజా హెగ్డేకు అది కాస్తా క్రేజ్ తీసుకొచ్చింది. కానీ, ఆ మూవీ కూడా యావరేజ్‌గా నిలిచింది.
వరుస ఫెయిల్యూర్స్
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా వరుస ఫెయిల్యూర్స్‌తో మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లింది పూజా హెగ్డే. హిందీలో రణ్‌వీర్ సింగ్‌తో చేసిన సర్కస్, సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలు కూడా కలిసి రాలేదు. ఇలా వరుసగా ఐదు ఫ్లాప్స్ అందుకుని డిజాస్టర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.
ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య రెట్రో మూవీతో మళ్లీ తానేంటో నిరూపించుకోవాలనుకుంటోంది పూజా హెగ్డే. ఈ సినిమాలో పూజా హెగ్డే డీ గ్లామర్ రోల్ చేస్తున్నట్లు ఇటీవల రిలీజైన రెట్రో టైటిల్ టీజర్ ద్వారా తెలుస్తోంది. అందులో సూర్యకు లవర్‌గా మేకప్ లేకుండా, డీ గ్లామర్ లుక్‌లో దర్శనం ఇచ్చిన పూజా హెగ్డే అట్రాక్ట్ చేసింది.
చేతిలో లేని ఒక్క తెలుగు సినిమా
రెట్రో సినిమాతోపాటు మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టింది పూజా హెగ్డే. అంటే, రెట్రోతో కలిపి పూజా హెగ్డే చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు భారీవే కావడం విశేషం. అయితే, వీటిలో ఒక్క స్ట్రైట్ తెలుగు సినిమా లేకపోవడం గమనార్హం.
పూజా హెగ్డే మరోసారి దళపతి విజయ్ సరసన నటించే సినిమా దళపతి69. విజయ్ కెరీర్‌లో 69వ సినిమాగా వస్తున్న ఈ మూవీని హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్నారు. అలాగే, ఇందులో బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.
వచ్చే ఏడాదే..
పూజా హెగ్డే చేతిలో రెండు బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. షాహిద్ కపూర్‌తో దేవ, వరుణ్ ధావన్‌తో హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాలు చేస్తోంది పూజా హెగ్డే. ఈ నాలుగు సినిమాలన్నీ వచ్చే ఏడాది 2025లో విడుదల కానున్నట్లు సమాచారం. అంటే, వచ్చే సంవత్సరం తన సినిమాలతో పూజా హెగ్డే అభిమానులకు ట్రీట్ అందించనుందని తెలుస్తోంది.
టాపిక్