Pooja Hegde New Car: దసరా రోజున కొత్త లగ్జరీ కారు కొన్న పూజా హెగ్డే.. కళ్లు చెదిరే ధర!-pooja hegde buys new range rover sv car on dussehra ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Pooja Hegde Buys New Range Rover Sv Car On Dussehra

Pooja Hegde New Car: దసరా రోజున కొత్త లగ్జరీ కారు కొన్న పూజా హెగ్డే.. కళ్లు చెదిరే ధర!

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 25, 2023 02:18 PM IST

Pooja Hegde New Car: హీరోయిన్ పూజా హెగ్డే కొత్త కారు కొనుగోలు చేశారు. ఇది ప్రీమియమ్ లగ్జరీ కారుగా ఉంది. ధర కూడా భారీగానే ఉంది. ఆ వివరాలివే..

Pooja Hegde New Car: దసరా రోజు కొత్త లగ్జరీ కారు కొన్న పూజా హెగ్డే..  కళ్లు చెదిరే ధర!
Pooja Hegde New Car: దసరా రోజు కొత్త లగ్జరీ కారు కొన్న పూజా హెగ్డే..  కళ్లు చెదిరే ధర!

Pooja Hegde New Car: టాలీవుడ్‍లో టాప్ హీరోయిన్‍గా ఉన్న పూజా హెగ్డే.. ప్రస్తుతం బాలీవుడ్‍పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. షాహిద్ కపూర్‌తో త్వరలోనే ఓ సినిమా చేస్తున్నారు ఈ బుట్టబొమ్మ. ఇటీవల మాల్దీవుల ట్రిప్‍కు వెళ్లి పూజ.. గ్లామర్ ట్రీట్ చేస్తూ చాలా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పుట్టిన రోజును జరుపుకున్నారు. కాగా, తాజాగా పూజా హెగ్డే ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. దసరా సందర్భంగా లగ్జరీ కారును సొంతం చేసుకున్నారు. రేంజ్ రోవర్‌కు చెందిన లగ్జరీ ఎస్‍యూవీని ఆమె కొత్తగా తీసుకున్నారు. ఆ వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

రేంజ్ రోవర్ ఎస్‍వీ (Range Rover SV) ఎస్‍యూవీ కారును పూజా హెగ్డే కొనుగోలు చేశారు. ముంబైలో కొత్త కారు నుంచి ఆమె దిగుతుండగా.. కెమెరాల కంటికి చిక్కారు. దీంతో కారు ముందు ఆమె కెమెరాలకు పోజులు ఇచ్చారు. దసరా సందర్భంగా సంప్రదాయ దుస్తులను పూజ హెగ్డే ధరించారు. బ్లూ అనార్కలి డ్రెస్ ధరించి అందంగా మెరిశారు బుట్టబొమ్మ.

పూజా హెగ్డే కొనుగోలు చేసిన ఈ రేంజ్ రోవర్ ఎస్‍వీ మోడల్ కారు ధర సుమారు రూ.4కోట్లుగా ఉందని తెలుస్తోంది. ఎస్‍వీ లైనప్‍లో టాప్ ఎండ్ మోడల్‍ను ఆమె తీసుకున్నారట. ఫుల్ ప్రీమియమ్ లగ్జరీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఈ కారు కలిగి ఉంది.

6-సిలిండర్ ఇండేనియమ్ పెట్రోల్ ఇంజిన్, శక్తివంతమైన 294 kW మోటార్‌ను రేంజ్ రోవర్ ఎస్‍వీ కలిగి ఉంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 234 కిలోమీటర్లుగా ఉంటుంది. 35 స్పీకర్ల మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 13.1 ఇంచుల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్, హెడ్ అప్ డిస్‍ప్లే, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి చాలా అధునాతన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఈ కారు కలిగి ఉంది.

శ్రద్ధ కపూర్ కొత్త కారు

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ కూడా కొత్త ప్రీమియమ్ కారు కొనుగోలు చేశారు. లంబోర్ఘినీ హురాకన్ టెక్నికా కారు తీసుకున్నారు. ఈ కారు ధర సుమారు రూ.4.8కోట్లుగా ఉంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.