Pooja Hegde: మళ్లీ కెమెరా ముందుకు పూజాహెగ్డే - మలయాళం డైరెక్టర్‌తో బాలీవుడ్ మూవీ - టైటిల్ ఇదే
Pooja Hegde: బాలీవుడ్ మూవీ దేవాతో మళ్లీ కెమెరా ముందుకు వస్తోంది పూజాహెగ్డే. దసరా సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.
Pooja Hegde: లాంగ్ బ్యాక్ తర్వాత పూజాహెగ్డే తిరిగి కెమెరా ముందుకు రాబోతోంది.బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో ఓ పూజా హెగ్డే ఓ సినిమా సైన్ చేసింది. ఈ మూవీకి దేవా అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
దసరా సందర్భంగా దేవా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో చేతిలో రివాల్వర్ పట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో షాహిద్ కపూర్ కనిపిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా దేవా మూవీ తెరకెక్కుతోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో షాహిద్ కపూర్ కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కనిపిస్తోంది.
పూజాహెగ్డే పాత్ర కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉండబోతున్నట్లు సమాచారం. దేవా మూవీకి మలయాళం డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 11న దేవా సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. చాలా రోజుల క్రితమే దేవాను అనౌన్స్ చేసినా ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. ఫస్ట్ లుక్‌తో ఈ పుకార్లకు సినిమా యూనిట్ పుల్‌స్టాప్ పెట్టింది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్...
తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగిన పూజాహెగ్డే జోరుకు పరాజయాల కారణంగా బ్రేకులు పడ్డాయి. అల వైకుంఠపురములో, అరవింద సమేత వీరరాఘవతో పాటు పలు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకోవడంతో పూజాహెగ్డే క్రేజ్ అమాంతం పెరిగింది. బాలీవుడ్, తమిళ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాల్ని అందుకున్నది.
రాధేశ్యామ్‌తో పూజాహెగ్డే బ్యాడ్ టైమ్ స్టార్టయింది. ఆ తర్వాత ఆమె నటించిన బీస్ట్, ఆచార్యతో పాటు బాలీవుడ్ మూవీస్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్, సర్కస్ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి.
మహేష్‌బాబు గుంటూరు కారం నుంచి అనివార్య కారణాల వల్ల వైదొలగడంతో పూజా హెగ్డే చేతిలో ఒక్క అవకాశం లేకుండా పోయింది. దేవా సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతోనే మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తుందో లేదో అన్నది వచ్చే ఏడాది తేలనుంది.