Pooja Hegde Flops 2022: గోల్డెన్ లెగ్ కాస్త్ ఐరన్ లెగ్‌గా మారింది.. 3 భాషలు.. 4 ఫ్లాపులు-pooja hegde became iron leg girl she got four flops in 2022 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pooja Hegde Became Iron Leg Girl She Got Four Flops In 2022

Pooja Hegde Flops 2022: గోల్డెన్ లెగ్ కాస్త్ ఐరన్ లెగ్‌గా మారింది.. 3 భాషలు.. 4 ఫ్లాపులు

Maragani Govardhan HT Telugu
Dec 26, 2022 08:01 AM IST

Pooja Hegde Flops 2022: ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస విజయాలను అందుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం పరాజయాలతో డీలా పడుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమెకు ఐరన్ లెగ్ ముద్ర పడింది.

పూజా హెగ్డే
పూజా హెగ్డే (HT_PRINT)

Pooja Hegde Flops 2022: టాలీవుడ్‌లో పూజా హెగ్డే అరంగేట్రం చేసినప్పటి నుంచి గోల్డెన్ లెగ్ పేరును సార్థకం చేసుకుంది. తెలుగులో ఆరంభంలో ఆమె నటించిన సినిమాలు పరాజయం చెందినప్పటికీ తర్వాతి కాలంలో వరుసగా విజయాలు అందుకుని గోల్డెన్ లెగ్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దువ్వాడ జగన్నాథం నుంచి అరవింద సమేత, అల వైకుంఠపురములో, మహర్షి, గద్దలకొండ గణేష్, మోస్ట్ ఎలిజుబుల్ బ్యాచిలర్ ఇలా వరుసగా హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఈ ఏడాది మాత్రం అస్సలు కలిసి రాలేదు. ఆమె నటించిన సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ ముందు బోర్లా పడ్డాయి. ఈ ఏడాది మూడు భాషల్లో నాలుగు సినిమాల్లో నటించిన మన బుట్టబొమ్మకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా దక్కలేదు.

ఇలా పూజా నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో గోల్డెన్ లెగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఐరన్‌లెగ్‌గా మారిపోయింది. ఈ ఏడాది ఆరంభంలోనే ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించగా.. ఆ సినిమా పరాజయం పాలైంది. అనంతరం మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమాలో కీలక పాత్రలో మెరిసిన ఈ బ్యూటీకి ఆ చిత్ర ఫలితం కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. అనంతరం తమిళంలో తలపతి విజయ్ సరసన నటించిన బీస్ట్ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించలేపోయింది. ఆ సినిమాలో అరబిక్ కూతు అనే పాటలో మినహా ఆమె పాత్రకు ప్రాధాన్యం కూడా పెద్దగా లేదు. చివరగా ఈ క్రిస్మస్‌కు బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ సరసన నటించిన సర్కస్ చిత్రం కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ ఏడాది ఆమె నటించిన నాలుగు సినిమాలు కూడా భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి.

పూజా నటించిన ఈ నాలుగు సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రాలు కావడం గమనార్హం. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ ముద్దుగుమ్మను దర్శక, నిర్మాతలు ఐరన్ లెగ్‌గా పిలుస్తున్నారు. ఒకప్పుడు గోల్డెన్ లెగ్‌గా పిలిచిన వారే.. ఇప్పుడు ఆమెను తీసుకోవాలంటే వెనకడుగు వేస్తున్నారని ఫిల్మ్ వర్గాల టాక్.

ఓ పక్క పూజా హెగ్డేను పరాజయాలు పలకరించినప్పటికీ ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB28 చిత్రంలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. ఇది కాకుండా సల్మాన్ ఖాన్ సరసన కిసి కా భాయ్ కిసి కా జాన్ అనే చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఇది కాకుండా మరో హిందీ చిత్రం కూడా ఈ బ్యూటీ చేతిలో ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం