Pooja Bhatt: తండ్రితో లిప్ కిస్.. 33 ఏళ్లకు క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
Pooja Bhatt Mahesh Bhatt Lip Kiss: హిందీ చలనచిత్ర పరిశ్రమలో 33 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఓ మ్యాగజైన్ కవర్ ఫొటోపై తాజాగా నటి, నిర్మాత పూజా భట్ క్లారిటీ ఇచ్చింది. తన తండ్రితో లిప్ లాక్ చేయడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో మహేష్ భట్ ఒకరు. హిందీ చిత్రసీమకు ఏమాత్రం పరిచయం లేని మహేష్ భట్ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆర్ఆర్ఆర్ బ్యూటి అలియా భట్ (Alia Bhatt) తండ్రిగా సుపరిచితం. హిందీలో అనేక చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన మహేష్ భట్ తన ఇద్దరు కూతుళ్లు పూజా భట్, అలియా భట్‍లను ఇండస్ట్రీకి హీరోయిన్లుగా పరిచయం చేశాడు. మొదటి భార్య కుమార్తె పూజా భట్ మొదట్లో హీరోయిన్‍గా విపరీతమైన క్రేజ్ అందుకుంది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా రాణిస్తోంది.
33 ఏళ్ల క్రితం
అయితే సుమారు 33 సంవత్సరాల క్రితం ఓ మ్యాగజైన్ ఫొటోషూట్ కోసం కూతురు పూజాతో మహేష్ భట్ చేసిన లిప్ లాక్ అప్పట్లో సంచలనం సృష్టించింది. తండ్రీకూతుళ్లు అలా లిప్ కిస్ ఇచ్చుకోవడం ఏంటీ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా భట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇలాగే ముద్దు పెట్టుకుంటారు
"అది చాలా మాములు విషయం. కానీ, ఆ ఫొటోలను కొంతమంది మాత్రం వేరేలా అర్థం చేసుకోవడం చాలా దురదృష్టం. తండ్రితో లిప్ కిస్ ఏంటీ అంటూ అప్పట్లో నాపై ఎన్నో విమర్శలు చేశారు. అప్పుడు షారుక్ ఖాన్ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. చిన్నప్పుడు పిల్లలను తల్లిదండ్రులు ఇలాగే ముద్దు పెట్టుకుంటారు. పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లిదండ్రులు మాత్రం వాళ్లను చిన్నవాళ్లలాగే చూస్తారని షారుక్ నాతో అన్నారు. నిజం చెప్పాలంటే నా తండ్రి నన్ను ఇప్పటికీ ఒక చిన్న పిల్లలాగే చూస్తారు" అని పూజా భట్ తెలిపింది.
అతిపెద్ద జోక్
"ఆ ఫొటోషూట్ చేసినప్పుడు నాకు సమాజం గురించి పెద్దగా ఐడియా లేదు. విషయం ఏదైనా సరే ప్రజలు తమకు నచ్చినవిధంగా చూస్తుంటారు. తండ్రీ కుమార్తెల మధ్య అనుబంధాన్ని ప్రశ్నించే వాళ్లు ఏదైనా ఊహించుకోవచ్చు. ఎలాగైన కామెంట్స్ చేయగలరు. అలాంటి వారే మళ్లీ కుటుంబ విలువల గురించి మాట్లాడటం అతిపెద్ద జోక్" అని తండ్రితో చేసిన లిప్ లాక్‍పై పూజా భట్ స్పందించింది. కాగా 17 ఏళ్లకు డాడీ అనే మూవీతో హీరోయిన్‍గా ఎంట్రీ ఇచ్చిన పూజా టీనేజ్‍లోనే స్టార్ స్టేటస్ అందుకుంది.