Ponniyin Selvan Trailer Launch: పొన్నియిన్‌ సెల్వన్‌ ఆడియో, ట్రైలర్‌ వచ్చేది ఆ రోజే-ponniyin selvan trailer and audio launch date announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ponniyin Selvan Trailer Launch: పొన్నియిన్‌ సెల్వన్‌ ఆడియో, ట్రైలర్‌ వచ్చేది ఆ రోజే

Ponniyin Selvan Trailer Launch: పొన్నియిన్‌ సెల్వన్‌ ఆడియో, ట్రైలర్‌ వచ్చేది ఆ రోజే

HT Telugu Desk HT Telugu
Aug 30, 2022 07:56 PM IST

Ponniyin Selvan Trailer Launch: పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీ ట్రైలర్‌, ఆడియో లాంచ్‌కు టైమ్‌ ఫిక్సయింది. వచ్చే వారమే ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ కానుంది.

పొన్నియిన్ సెల్వన్ మూవీలో విక్రమ్
పొన్నియిన్ సెల్వన్ మూవీలో విక్రమ్ (twitter)

Ponniyin Selvan Trailer Launch: మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ పొన్నియిన్‌ సెల్వన్‌. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, కార్తీ, త్రిషలాంటి నటీనటులతో, ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేయడానికి వచ్చేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్‌ 30న రిలీజ్‌ కానుండగా.. తాజాగా మంగళవారం మూవీ ట్రైలర్‌, ఆడియో లాంచ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు.

పొన్నియిన్‌ సెల్వన్‌ ట్రైలర్‌, ఆడియో సెప్టెంబర్‌ 6వ తేదీన లాంచ్‌ కానున్నాయి. నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఈ లాంచ్‌ వేడుక జరగనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ద చోళాస్ ఆర్ కమింగ్ ఆన్ సెప్టెంబర్ 6 అంటూ ప్రత్యేకంగా పోస్టర్ రిలీజ్ చేసి ఈ అనౌన్స్ మెంట్ చేశారు.

ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియో హక్కులు ఇప్పటికీ భారీ మొత్తానికి అమ్ముడైన విషయం తెలిసిందే. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలలో పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ కాబోతోంది.

ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెప్టెంబర్‌ 30న వస్తున్న మూవీ పీఎస్‌1. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్స్‌, సాంగ్స్‌ అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యే చోళ చోళ అనే సాంగ్‌ కూడా రిలీజైంది. ఈ సందర్భంగా మాట్లాడిన మణిరత్నం.. అసలు రాజమౌళి వల్లే తాను పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా తీయగలిగానని అనడం విశేషం.

పదో శతాబ్దానికి చెందిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ భారీ ప్రాజెక్టును 1950లో ధారావాహికంగా వచ్చిన కల్కికి చెందిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్(కావేరి నది కుమారుడు) చోళుల రారాజైన రాజ రాజ చోళకు చెందినదిగా చెబుతున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.