Ponniyin Selvan -1 Telugu Trp Rating: పొన్నియ‌న్ సెల్వ‌న్ తెలుగు ప్రీమియ‌ర్‌కు డిజాస్ట‌ర్ టీఆర్‌పీ రేటింగ్ -ponniyin selvan telugu tv premiere gets shocking trp rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ponniyin Selvan Telugu Tv Premiere Gets Shocking Trp Rating

Ponniyin Selvan -1 Telugu Trp Rating: పొన్నియ‌న్ సెల్వ‌న్ తెలుగు ప్రీమియ‌ర్‌కు డిజాస్ట‌ర్ టీఆర్‌పీ రేటింగ్

Nelki Naresh Kumar HT Telugu
Mar 03, 2023 07:19 AM IST

Ponniyin Selvan -1 Telugu Trp Rating: విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన భారీ బ‌డ్జెట్ సినిమా పొన్నియ‌న్ సెల్వ‌న్ -1 తెలుగు టీవీ ప్రీమియ‌ర్ లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ సినిమాకు వ‌చ్చిన టీఆర్‌పీ రేటింగ్ ఎంతంటే.

పొన్నియ‌న్ సెల్వ‌న్ -1
పొన్నియ‌న్ సెల్వ‌న్ -1

Ponniyin Selvan -1 Telugu Trp Rating: స్టార్ డైరెక్టర్ మ‌ణిర‌త్నానికి తెలుగు ప్రేక్ష‌కులు గ‌ట్టిగానే షాక్ ఇచ్చారు. మ‌ణిర‌త్నం ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చారిత్ర‌క చిత్రం పొన్నియ‌న్ సెల్వ‌న్ -1 సినిమా తెలుగు టీవీ ప్రీమియ‌ర్‌కు డిజాస్ట‌ర్ టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది.

ఫిబ్ర‌వ‌రి 19న జెమిని టీవీలో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యింది. ఇదే ఫ‌స్ట్ ప్రీమియ‌ర్ కావ‌డంతో జెమిని టీవీ ఈ సినిమాను బాగానే ప్ర‌మోట్ చేసింది. కానీ ఈ భారీ బ‌డ్జెట్ మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు కేవ‌లం 2.73 టీఆర్‌పీ రేటింగ్ మాత్ర‌మే వ‌చ్చింది. త‌మిళంలో16.38తో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాల్లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ -1 కు తెలుగులో మాత్రం షాకింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

తెలుగులో డ‌బ్ అయిన త‌మిళ సినిమాల్లో అతి త‌క్కువ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న భారీ బ‌డ్జెట్ సినిమాగా పొన్నియ‌న్ సెల్వ‌న్ చెత్త రికార్డ్‌ను మూట గ‌ట్టుకుంది. త‌మిళ నేటివిటికీ ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ సినిమాను తెర‌కెక్కించ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అందువ‌ల్లే తెలుగు ఆడియెన్స్ సినిమాను తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం.

చోళ రాజ వంశం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో విక్ర‌మ్‌, జ‌యంర‌వి, కార్తి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష‌తో పాటు ప‌లువురు కోలీవుడ్ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో రిలీజైన వ‌ర‌ల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద 500 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్ 2 ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.

IPL_Entry_Point

టాపిక్