PS-1 Pre Release Event: పొన్నియిన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?-ponniyin selvan pre release event will held in hyderabad on 2022 september 23 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ponniyin Selvan Pre Release Event Will Held In Hyderabad On 2022 September 23

PS-1 Pre Release Event: పొన్నియిన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

Maragani Govardhan HT Telugu
Sep 21, 2022 01:11 PM IST

Ponniyin Selvan Pre Release Event: మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబరు 23న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

పొన్నియిన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్
పొన్నియిన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Instagram)

Ponniyin Selvan Pre Release Event: కోలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన విజవల్ వండర్ పొన్నియిన్ సెల్వన్. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం పీఎస్-1 ఇప్పుడు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం.

పొన్నియిన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబరు 23న హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్స్ వేదికగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఈ చిత్ర మేకర్స్ తెలియజేసారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

పొన్నియిన్ సెల్వన్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో భారీ ఎత్తున పబ్లిసీటీ చేస్తోంది చిత్రబృందం. మాతృక అయిన తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నద్ధమైంది.

పదో శతాబ్దానికి చెందిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ, రెహమాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్టును 1950లో ధారావాహికంగా వచ్చిన కల్కికి చెందిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్(కావేరి నది కుమారుడు) చోళుల రారాజైన రాజ రాజ చోళకు చెందిందిగా చెబుతున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నారు. సెప్టెంబరు 30 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం