Ponniyin Selvan Box Office Collection: త‌మిళంలో 200 కోట్ల క్ల‌బ్‌లో పొన్నియ‌న్ సెల్వ‌న్‌- తొలి సినిమాగా రికార్డ్‌-ponniyin selvan becomes first tamil film to achieve this rare record ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ponniyin Selvan Becomes First Tamil Film To Achieve This Rare Record

Ponniyin Selvan Box Office Collection: త‌మిళంలో 200 కోట్ల క్ల‌బ్‌లో పొన్నియ‌న్ సెల్వ‌న్‌- తొలి సినిమాగా రికార్డ్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 17, 2022 12:08 PM IST

Ponniyin Selvan Box Office Collection: పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త‌ రికార్డ్‌ల‌ను క్రియేట్ చేస్తోంది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చారిత్ర‌క చిత్రం కోలీవుడ్‌లో క‌లెక్ష‌న్స్ ప‌రంగా అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకొంది. ఆ రికార్డ్ ఏదంటే...

పొన్నియ‌న్ సెల్వ‌న్
పొన్నియ‌న్ సెల్వ‌న్

Ponniyin Selvan Box Office Collection: మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చారిత్ర‌క చిత్రం పొన్నియ‌న్ సెల్వ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. రెండు వారాల్లోనే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 460 కోట్ల‌కుపైగా ఈ సినిమా క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. తాజాగా ఈ సినిమా త‌మిళంలో కొత్త రికార్డ్ నెల‌కొల్పింది.

కోలీవుడ్‌లో రెండు వంద‌ల కోట్ల‌కుపైగా గ్రాస్‌ను రాబ‌ట్టింది. ఈ ఘ‌న‌త‌ను సాధించిన తొలి త‌మిళ సినిమాగా పొన్నియ‌న్ సెల్వ‌న్ రికార్డ్‌ క్రియేట్ చేసింది. త‌మిళ సాహిత్యం, సంస్కృతికి ప్రాముఖ్య‌త‌నిస్తూ మ‌ణిర‌త్నం ఈ సినిమాను తెర‌కెక్కించారు. అందువ‌ల్లే త‌మిళ‌నాడులో ఈ సినిమా భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ర‌చ‌యిత క‌ల్కి కృష్ణ‌మూర్తి రాసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ న‌వ‌ల ఆధారంగా అదే పేరుతో మ‌ణిర‌త్నం ఈ సినిమాను తెర‌కెక్కించారు.

చోళ సామ్రాజ్య చ‌క్ర‌వ‌ర్తి సుంద‌ర‌చోళుడితో పాటు అత‌డి కుమారులు క‌రికాల‌చోళుడు, పొన్నియ‌న్ సెల్వ‌న్ జీవితాల నేప‌థ్యంలో యాక్ష‌న్ డ్రామాగా పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమా రూపొందింది. ఈ సినిమాలోని విజువ‌ల్స్‌తో పాటు యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీలో మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా ఎగ్జిబిట‌ర్ల‌కు పొన్నియ‌న్ సెల్వ‌న్‌ చ‌క్క‌టి లాభాల‌ను మిగిల్చింది.

విక్ర‌మ్‌, కార్తి, జ‌యంర‌వి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు. రెండు భాగాలుగా ఈ సినిమా తెర‌కెక్కించారు మ‌ణిర‌త్నం. సెకండ్ పార్ట్ వ‌చ్చే ఏడాది వేస‌విలో రిలీజ్ కానుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి మ‌ణిర‌త్నం ఈ సినిమాను నిర్మించారు. ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందించాడు.

IPL_Entry_Point