PS-1 Second Single: పొన్నియిన్ సెల్వన్ నుంచి మరో పాట.. చోళ చోళ సాంగ్ రిలీజ్-ponniyin selvan another song chola chola released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ponniyin Selvan Another Song Chola Chola Released

PS-1 Second Single: పొన్నియిన్ సెల్వన్ నుంచి మరో పాట.. చోళ చోళ సాంగ్ రిలీజ్

Maragani Govardhan HT Telugu
Aug 19, 2022 06:45 PM IST

మణిరత్నం రూపొందిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాలో సెకండ్ సింగిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. విక్రమ్, జయం రవి, ఐశ్వర్య రాయ్, కార్తి తదితరులు నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 30న విడుదల కానుంది.

పొన్నియిన్ సెల్వన్ నుంచి మరో పాట
పొన్నియిన్ సెల్వన్ నుంచి మరో పాట (Twitter)

దిగ్గజ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్, జయం రవి, కార్తి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ఇండియా రేంజ్‌లో ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన టీజర్, మొదటి పాట ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. తాజాగా పీఎస్-1లో రెండో పాటను విడుదల చేశారు మేకర్స్.

చోళ చోళ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. చోళ సామ్రాజ్యం విశిష్టతను తెలియజేసేలా.. ఉద్రేకంగా, ఇదే సమయంలో ఆసక్తికరంగా ఉంది. ఈ పాట విక్రమ్‌పై చిత్రీకరించినట్లు ఈ లిరికల్ వీడియో విజువల్స్ తీస్తే తెలుస్తోంది. అదిరిపోయే విజువల్స్‌తో వైవిధ్యమైన గ్రాఫిక్స్‌ను రూపొందించి పాటను డిజైన్ చేశారు. వీడియో చూసేందుకు ఆసక్తికరంగా సాగింది.

ఈ చోళ చోళ సాంగ్ తెలుగు వెర్షన్‌ను ప్రముఖ గాయకులు మనో, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. ఏఆర్ రెహమాన్ని సంగీతాన్ని సమకూర్చారు. పాట మంచి ఊపు తెచ్చేలా సాగింది. పదో శతాబ్దానికి చెందిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ, రెహమాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్టును 1950లో ధారావాహికంగా వచ్చిన కల్కికి చెందిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్(కావేరి నది కుమారుడు) చోళుల రారాజైన రాజ రాజ చోళకు చెందిందిగా చెబుతున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నారు. సెప్టెంబరు 30 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.