Ponniyin Selvan - 2 Release Date: పొన్నియన్ సెల్వన్ - 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు
Ponniyin Selvan - 2 Release Date: పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్ డేట్‌ను బుధవారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందంటే...
Ponniyin Selvan - 2 Release Date: పొన్నియన్ సెల్వన్ సీక్వెల్ రిలీజ్ డేట్‌ను బుధవారం అనౌన్స్‌చేశారు. విలక్షణ దర్శకుడు మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ -1 పాన్ ఇండియన్ లెవెల్‌లో పెద్ద విజయాన్ని సాధించింది. సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఐదు వందల కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా బుధవారం సీక్వెల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
2023 ఏప్రిల్ 28న పొన్నియన్ సెల్వన్ -2 ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఓ వీడియోను రిలీజ్ చేశారు. చోళ సామ్రాజ్య చక్రవర్తి సుందర చోళుడితో పాటు అతడి కుమారులు కరికాల చోళుడు, పొన్నియన్ సెల్వన్ జీవితాల నేపథ్యంలో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇందులో విక్రమ్, కార్తి, జయంరవి, ఐశ్వర్యరాయ్, త్రిష తో పాటు కోలీవుడ్‌కు చెందిన అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. విక్రమ్, ఐశ్వర్యరాయ్ నటన, గ్రాండియర్ విజువల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.పొన్నియన్ సెల్వన్‌తో పాటు అతడి అనుచరుడు వందిదేవుడు ప్రమాదంలో పడినట్లుగా చూపించడంతో ఫస్ట్ పార్ట్‌ను ఎండ్ చేశారు మణిరత్నం.
సెకండ్ పార్ట్‌లో తమ కుటుంబంపై కుట్రలు పన్నిన నందినితో పాటు పెదపళువెట్టరాయర్‌ను ఎదురించి చోళ సామ్రాజ్యాన్ని కరికాళుడు, పొన్నియన్ సెల్వన్ ఏ విధంగా నిలబెట్టారన్నది చూపించబోతున్నట్లు సమాచారం.
ఈ సీక్వెల్‌కు సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తయినట్లు తెలిసింది. కొన్ని సన్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్‌గా మిగిలినట్లు తెలిసింది. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మద్రాస్ స్టూడియోస్ పతాకంపై మణిరత్నం ఈ సినిమాను నిర్మించారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు.