Ponniyin Selvan 2 OTT Release: పొన్నియిన్ సెల్వన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌పై బజ్.. ఎప్పుడు? ఎందులో వస్తుందంటే?
Ponniyin Selvan 2 OTT Release: మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియిన్ సెల్వన్ 2 మూవీపై విపరీతంగా బజ్ ఏర్పడింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.
Ponniyin Selvan 2 OTT Release: మణిరత్నం ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియిన్ సెల్వన్. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ గతేడాది విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం రెండో భాగం విడుదలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో మరికొన్ని గంటల్లో విడుదల కానున్న తరుణంలో ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ గురించి ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రాన్ని డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీంతో ఈ ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ మూవీని డిజిటల్ మాధ్యమంలో విడుదల చేసేందుకు కాస్త సమయం పట్టే అవకాశముంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను జూన్ ప్రారంభంలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. అది కూడా సినిమా రిజల్ట్‌పై ఆధారపడి ఉంటుంది.
పొన్నియిన్ సెల్వన్ సినిమా మణిరత్నం కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఆయన కలల ప్రాజెక్టు. ప్రముఖ తమిళ రచయిత కల్కీ రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. 1980వ దశకం నుంచి ఈ చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించాలనకున్న ఆయన.. ఆ కలను దాదాపు 40 ఏళ్ల తర్వాత నెరవేర్చుకున్నారు. ఈ సమయంలో సినిమాను పట్టాలెక్కించడానికి ప్రయత్నించనప్పటికీ ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీలో లోపాల కారణంగా ఆయన ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు.
ఈ సినిమాను రూపొందించడానికి తనకు రాజమౌళినే కారణమని మణిరత్నం తెలిపారు. బాహుబలి, బాహుబలి 2 కారణంగానే పొన్నియిన్ సెల్వన్ తెరకెక్కించాలనే ఆలోచన వచ్చినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా మూవీ రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ఐడియా అక్కడ నుంచే వచ్చిందని స్పష్టం చేశారు.
మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ లాంటి భారీ తారాగణం ఇందులో నటించింది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. మాతృక తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది విడుదల కానుంది.