OTT Releases this Week: ఈ వారం ఓటీటీల్లో అడుగుపెట్టనున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే.. పొలిమేర-2, వధువు సహా మరిన్ని..-polimera 2 to vadhuvu movies and web series to release on ott platforms in december 2nd week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Polimera 2 To Vadhuvu Movies And Web Series To Release On Ott Platforms In December 2nd Week

OTT Releases this Week: ఈ వారం ఓటీటీల్లో అడుగుపెట్టనున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే.. పొలిమేర-2, వధువు సహా మరిన్ని..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 04, 2023 09:13 PM IST

OTT Releases this Week: ఓటీటీల ప్రేక్షకులకు ఈ వారం మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు అందుబాటులోకి రానున్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి ఏవి అడుగుపెట్టనున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

OTT Releases this Week: ఈ వారం ఓటీటీల్లో అడుగుపెట్టనున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే
OTT Releases this Week: ఈ వారం ఓటీటీల్లో అడుగుపెట్టనున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే

OTT Releases this Week: ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో కంటెంట్ చూడాలనుకునే వారి కోసం ఈ వారం మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. ప్రస్తుత డిసెంబర్ 2వ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. మా ఊరి పొలిమేర-2, జిగర్తాండ డబుల్ ఎక్స్ సహా మరిన్ని చిత్రాలు ఓటీటీల్లో ఈ వారమే స్ట్రీమింగ్‍కు వస్తాయి. వధువు సహా మరిన్ని సిరీస్‍లు అడుగుపెడతాయి. ఈవారం ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఏవో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

ఆహా

మా ఊరి పొలిమేర-2 - ఆహా: సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర-2’ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో డిసెంబర్ 8వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఆహా గోల్డ్ సబ్‍స్క్రిప్షన్ ఉన్న వారికి 24 గంటల ముందే అందుబాటులోకి వస్తుంది. చేతబడి, క్షుద్రపూజలు, మర్డర్ మిస్టరీ చుట్టూ ‘మా ఊరి పొలిమరే-2’ సినిమా తెరకెక్కింది. నవంబర్ 3న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది.

నెట్‍ఫ్లిక్స్

జిగర్తండ డబుల్ ఎక్స్: రాఘవ లారెన్స్, ఎస్‍జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన జిగర్తండ డబుల్ ఎక్స్ సినిమా డిసెంబర్ 8వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. జిగర్తండకు సీక్వెల్‍గా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు దక్కించుకుంది. ఇప్పుడు డిసెంబర్ 8న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టనుంది.

  • అనలాగ్ స్క్వాడ్ - వెబ్ సిరీస్ - నెట్‍ఫ్లిక్స్ - డిసెంబర్ 7
  • బ్లడ్ కోస్ట్ - వెబ్ సిరీస్ - నెట్‍ఫ్లిక్స్ - డిసెంబర్ 6
  • ది ఆర్చీస్ - సినిమా - నెట్‍ఫ్లిక్స్ - డిసెంబర్ 7
  • క్రిస్మస్ యాజ్ యూజువల్ - సినిమా - నెట్‍ఫ్లిక్స్ - డిసెంబర్ 6
  • ధక్ ధక్ - సినిమా - నెట్‍ఫ్లిక్స్ - డిసెంబర్ 8
  • హై టైడ్స్ - డిసెంబర్ 7 - నెట్‍ఫ్లిక్స్
  • హిల్డా సీజన్ 3 - వెబ్ సిరీస్ - నెట్‍ఫ్లిక్స్ - డిసెంబర్ 7
  • ఐ హేట్ క్రిస్మస్ సీజన్ -2 - సిరీస్ - నెట్‍ఫ్లిక్స్ - డిసెంబర్ 7
  • లీవ్ ది వరల్డ్ బిహైండ్ - సినిమా - నెట్‍ఫ్లిక్స్ - డిసెంబర్ 8
  • మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ - వెబ్ సిరీస్ - నెట్‍ఫ్లిక్స్ - డిసెంబర్ 7

డిస్నీ+ హాట్‍స్టార్

వధువు వెబ్ సిరీస్ - డిస్నీ+ హాట్‍స్టార్: యువ నటి అవికా గోర్ ప్రధాన పాత్ర పోశించిన వధువు వెబ్ సిరీస్ డిసెంబర్ 8న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. తాను కోడలిగా అడుగుపెట్టిన ఇంట్లోని మిస్టరీని ఛేదించే వధువు కథాంశంతో ఈ సిరీస్ రూపొందింది.

  • డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ - సినిమా - డిస్నీ+ హాట్‍స్టార్ - డిసెంబర్ 8
  • హిస్టరీ: ది ఇంట్రెస్టింగ్ బిట్స్ - సిరీస్ - డిస్నీ+ హాట్‍స్టార్ - డిసెంబర్ 7
  • ది మిషన్ - డాక్యుమెంటరీ ఫిల్మ్ - డిస్నీ+ హాట్‍స్టార్ డిసెంబర్ 10

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • మస్తే మే హర్నేకా - సినిమా - అమెజాన్ ప్రైమ్ వీడియో - డిసెంబర్ 7
  • మన్ పసంద్ - స్టాండప్ కామెడీ స్పెషల్ - అమెజాన్ ప్రైమ్ వీడియో - డిసెంబర్ 7
  • డేటింగ్ శాంటా - అమెజాన్ ప్రైమ్ వీడియో - డిసెంబర్ 8
  • మెర్రీ లిటిల్ బ్యాట్‍మ్యాన్ - సినిమా - అమెజాన్ ప్రైమ్ వీడియో - డిసెంబర్ 8

జీ5

  • కఢక్ సింగ్ - సినిమా - జీ5 - డిసెంబర్ 8
  • కుసే ముణిస్వామి వీరప్పన్ - డాక్యుమెంట్ సిరీస్ - జీ5 - డిసెంబర్ 8

జియోసినిమా

  • స్మూత్‍రెడ్ - సినిమా - జియో సినిమా - డిసెంబర్ 8
  • స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ! - సినిమా - జియో సినిమా - డిసెంబర్ 10

WhatsApp channel