Polimera 2 OTT Streaming: పొలిమేర 2 మూవీని ఆహాలో ఒక రోజు ముందుగానే ఇలా చూడండి-polimera 2 ott streaming watch this super hit movie 24 hours before with aha gold subscription ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Polimera 2 Ott Streaming: పొలిమేర 2 మూవీని ఆహాలో ఒక రోజు ముందుగానే ఇలా చూడండి

Polimera 2 OTT Streaming: పొలిమేర 2 మూవీని ఆహాలో ఒక రోజు ముందుగానే ఇలా చూడండి

Hari Prasad S HT Telugu
Dec 05, 2023 01:41 PM IST

Polimera 2 OTT Streaming: సూపర్ హిట్ మూవీ మా ఊరి పొలిమేర 2 మూవీ ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఆహాలో ఒక రోజు ముందుగానే చూసే అవకాశం ఉంది.

మా ఊరి పొలిమేర 2 మూవీ
మా ఊరి పొలిమేర 2 మూవీ

Polimera 2 OTT Streaming: టాలీవుడ్‌లో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిన మరో సినిమా మా ఊరి పొలిమేర 2. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించిన ఈ సినిమా వచ్చే శుక్రవారం (డిసెంబర్ 8) ఓటీటీలోకి రాబోతోంది. ఆహా ఓటీటీ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. అయితే ఈ ఆహాలో ఒక రోజు ముందుగానే అంటే గురువారం (డిసెంబర్ 7) నుంచి ఈ మూవీని చూడొచ్చు.

పొలిమేర 2 మూవీని 24 గంటల ముందుగా చూడాలంటే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మంగళవారం (డిసెంబర్ 5) సోషల్ మీడియా ద్వారా ఆహా వెల్లడించింది. "గ్రిప్పింగ్ థ్రిల్లర్ మీ ముందుకు వస్తోంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు 24 గంటల ముందుగానే సినిమా యాక్సెస్ లభిస్తుంది" అంటూ పొలిమేర 2 ట్రైలర్ ను పోస్ట్ చేసింది.

ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఎలా?

ఆహా ఓటీటీ వివిధ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్లను ప్రేక్షకులకు అందిస్తోంది. అందులో ఈ ఆహా గోల్డ్ కూడా ఒకటి. ఈ గోల్డ్ ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే ఏడాదికి రూ.899 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే.. ఏడాది పాటు ఆహాలో 4కే క్వాలిటీతో సినిమాలు, వెబ్ సిరీస్, ఇతర షోలు చూడొచ్చు. అంతేకాదు ఒక రోజు ముందే ఇలా మూవీస్, వెబ్ సిరీస్ యాక్సెస్ చేసే అవకాశం కూడా కలుగుతుంది.

ఇది కాకుండా రూ.699తో మరో యానువల్ ప్లాన్ కూడా ఆహాలో ఉంది. దీని కింది ఏడాది పాటు ఫుల్ హెడ్‌డీ క్వాలిటీతో సినిమాలు, వెబ్ సిరీస్, షోలు చూడొచ్చు. వీళ్లకు ఒక రోజు ముందు యాక్సెస్ ఉండదు. ఈ రెండు ప్లాన్లలోనూ యాడ్స్ లేకుండా చూసే వీలుంటుంది. ఇవి కాకుండా మూడు నెలలకు రూ.99 ప్లాన్, ఏడాదికి రూ.399 ప్లాన్, మూడు నెలలకు రూ.199 ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

పొలిమేర 2 ఎలా ఉందంటే?

సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో 2021లో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చి సూపర్ సక్సెస్ అయింది. చేతబడి, మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఆ మూవీకి ప్రేక్షకులను నుంచి మంచి ఆదరణ లభించింది. ఆ సినిమాకు సీక్వెల్‍గా ఇటీవలే ‘మా ఊరి పొలిమేర-2’ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది.

మా ఊరి పొలిమేర-2 చిత్రం కూడా చేతబడి, క్షుద్రపూజల చుట్టే తిరుగుతుంది. ఈ మూవీలోని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను, బాలాదిత్య, రవివర్మ, రాఖేందుమౌళి కీలకపాత్రలు పోషించారు.

Whats_app_banner