51 ఏళ్ల వయసులోనూ తన హాట్ నెస్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది మలైకా అరోరా. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్ అయిన ఈ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మరోసారి హాట్ డ్యాన్స్ తో అదరగొట్టింది. రష్మిక మందన్నతో కలిసి మంట పుట్టించింది. థామా మూవీ పాయిజన్ బేబీ సాంగ్ లో మలైకా, రష్మిక డ్యాన్స్ తెగ వైరల్ గా మారింది.
రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జోడీగా నటించిన థామా మూవీ నుంచి మరో వీడియో సాంగ్ రిలీజైంది. ‘పాయిజన్ బేబీ’ అంటూ సాగే ఈ పాటలో మలైకా అరోరా, రష్మిక మందన్న అందాలు మంట పుట్టిస్తున్నాయి. ఈ సాంగ్ ఇన్ స్టంట్ సెన్సేషన్ గా మారింది. ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. జాస్మిన్ సాండ్లాస్, సచిన్-జిగర్, దివ్య కుమార్ పాడిన పాయిజన్ బేబీ సాంగ్ తెగ వైరల్ గా మారింది.
పాయిజన్ బేబీ సాంగ్ లో మలైకా అరోరా ఖాన్, రష్మిక మందన్న హాట్ మూవ్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. పాట బీట్స్ కు తగ్గట్లూ వీళ్ల డ్యాన్స్ అదిరిపోయింది. సాహిత్యాన్ని అమితాబ్ భట్టాచార్య రాశారు. ఆయుష్మాన్ ఖురానా పాత్ర రష్మిక తో అంతరిక్షంలోకి ప్రవేశించడాన్ని మనం చూస్తున్నందున మలైకా క్లబ్ లాంటి సెట్టింగ్ లో నృత్యం చేస్తుంది. అతను ఆమెను దగ్గరగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆమె కళ్ళు ఒక గ్లాసు రెడ్ వైన్ పై పడతాయి. ఆ తర్వాత మత్తులో రష్మిక డ్యాన్స్ చేస్తుంది.
మలైకా, రష్మిక డ్యాన్స్ మంట పుట్టించంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. "రష్మిక, మలైకా అరోరా డ్యాన్స్ మంటలు పుట్టిస్తోంది’’ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఈ వీడియో సాంగ్ లో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, డైరెక్టర్ అమర్ కౌశిక్ కూడా కనిపించారు.
స్త్రీ (2018), భేడియా (2022), ముంజ్య, స్త్రీ 2 (2024) తర్వాత మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో థామా అయిదో సినిమా. ట్రైలర్ లో ఆయుష్మాన్ ఖురానా అకస్మాత్తుగా రక్త పిశాచిగా మారే సాధారణ వ్యక్తిగా నటించాడు. అతను రష్మిక మందన్నతో ప్రేమలో పడతాడు. కానీ వాళ్ల రొమాన్స్ సవాళ్లను ఎదుర్కొంటుంది. రష్మిక, మానవత్వాన్ని కాపాడటానికి అతను నవాజుద్దీన్ సిద్ధిఖీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ చిత్రం ఒక నెత్తుటి ప్రేమకథ అని చెప్తున్నారు. ఈ దీపావళికి 21 అక్టోబర్ 2025 న థియేటర్లలో విడుదల కానుంది థామా.
సంబంధిత కథనం