OTT Latest Movies: దీపావళికి ఓటీటీల్లో సినిమాలు చూడాలనుకుంటున్నారా.. లేటెస్ట్ టాప్ 7 చిత్రాలు ఇవే
OTT Diwali Movies: దీపావళి సెలవుల్లో ఓటీటీల్లో సినిమాలు చూడాలనుకునే వారికి లేటెస్ట్‌గా మంచి ఆప్షన్లు వచ్చాయి. కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చాయి. అవేవో ఇక్కడ చూడండి.
వచ్చే వారం దీపావళి పండుగ ఉండనుంది. ఈ పండుగ సెలవుల్లో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో లేటెస్ట్‌గా వచ్చిన సినిమాలు చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. ఇటీవల చాలా చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. వాటిలో కొన్ని టాప్ సినిమాలు ఉన్నాయి. పండుగకు చూసేందుకు పర్‌ఫెక్ట్‌గా ఉంటాయి. స్వాగ్, సత్యం సుందరం సహా మరిన్ని చిత్రాలు ఈ లిస్టులో ఉన్నాయి. దీపావళికి ఓటీటీలో చూసేందుకు లేటెస్ట్ టాప్ చిత్రాలు ఇవే..
శ్వాగ్
యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన శ్వాగ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీలో శ్రీవిష్ణు ఐదు పాత్రల్లో నటనతో మెప్పించారు. అక్టోబర్ 4వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మూడు వారాల్లోనే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. హర్షిత్ గోలీ దర్శకత్వం వహించిన ఈ శ్వాగ్ మూవీలో రితూ వర్మ హీరోయిన్‍గా నటించారు. మీరా జాస్మిన్, దక్షా నాగర్కర్, రవిబాబు కీరోల్స్ చేశారు. ఈ కామెడీ మూవీ దీపావళికి ప్రైమ్ వీడియోలో చూసేందుకు మంచి ఆప్షన్‍గా ఉంటుంది.
సత్యం సుందరం
మేయళగన్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అక్టోబర్ 25న స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ సత్యం సుందరం కూడా అందుబాటులోకి వచ్చింది. తమిళ స్టార్లు కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం తమిళం, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. సెప్టెంబర్లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సత్యం సుందరం మూవీ పండుగకు ఫ్యామిలీతో కలిసి చూసేందుకు కూడా సరిగ్గా సరిపోతుంది.
లబ్బర్ పందు.. తెలుగులోనూ..
తమిళ మూవీ లబ్బర్ పందు అక్టోబర్ 31వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమ్ అవనుంది. గల్లీ క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍లో డ్రామా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో హరీశ్ కల్యాణ్, అట్టకత్తి దినేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 20న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ హిట్ అయింది. అక్టోబర్ 31 నుంచి లబ్బర్ పందు మూవీని హాట్‍స్టార్ ఓటీటీలో చూడొచ్చు.
తంగలాన్
తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన తంగలాన్ చిత్రం ఓటీటీలోకి దీపావళి సందర్భంగా వస్తుందనే అంచనాలు ఉన్నాయి. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇటీవల ఆ దిశగా సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా అక్టోబర్ 31వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ వస్తుంది. పా రంజిత్ దర్శకత్వం వహించిన తంగలాన్ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైంది.
దో పత్తీ
బాలీవుడ్ స్టార్లు కృతి సనన్, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘దో పత్తీ’ అక్టోబర్ 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో కాకుండా ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీకి శశాంత చతుర్వేది దర్శకత్వం వహించారు.
కడైసీ ఉలగ పోర్
తమిళ మూవీ కడైసీ ఉలగ పోర్ చిత్రం అక్టోబర్ 25న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో హిప్‍హాప్ తమిళ, నాజర్ లీడ్ రోల్స్ చేశారు. హిప్‍హాప్ తమిళనే దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న థియేటర్లలో రిలీజైంది. కడైసీ ఉలగ పోర్ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.
లిటిల్ హార్ట్స్
మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్ సినిమా తెలుగు డబ్బింగ్‍లోకి వచ్చింది. ఈ చిత్రం తెలుగులో ఆహా ఓటీటీలో అక్టోబర్ 24న స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. మలయాళంలో జూన్‍లో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో ఆహాలోకి అడుగుపెట్టింది. లిటిల్ హార్ట్స్ మూవీలో షేన్ నిగమ్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రలు పోషించారు.