Suriya Father: హీరో సూర్య తండ్రి నటించిన సీరియల్స్ ఇవే - తెలుగులోనూ పెద్ద హిట్!
Suriya Father: ప్రస్తుతం కోలీవుడ్‌లో స్టార్ హీరోలుగా కొనసాగుతోన్నారు సూర్య, కార్తీ. ఈ హీరోల తండ్రి శివకుమార్ తమిళంలో 1970, 80 దశకంలో అగ్ర నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తమిళంలో 200లకుపైగా సినిమాలు చేశారు. శివకుమార్ నటించిన తమిళ సీరియల్స్ తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్‌గా నిలిచాయి.
Suriya Father: కోలీవుడ్‌లో అగ్ర కథానాయకులుగా కొనసాగుతోన్నారు సూర్య, కార్తీ. పాన్ ఇండియన్ సినిమాలతో సూర్య సత్తా చాటుతోండగా, డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ కార్తీ విజయాల్ని అందుకుంటోన్నాడు. సూర్య, కార్తీ తండ్రి శివకుమార్ కూడా 1970-80 దశకంలో తమిళంలో గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
200 సినిమాలు...
నలభై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 200లకుపైగా తమిళ సినిమాలు చేశారు శివకుమార్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని అందుకున్నాడు. కే బాలచందర్, ఐవి శశి, మణివణ్ణన్ వంటి అగ్ర దర్శకులతో సినిమాలు చేశాడు శివకుమార్. కే బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన సింధు భైరవి, అగ్ని సాక్షి సినిమాల్లో విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.
సీరియల్స్‌లో...
సినిమాలు మాత్రమే కాకుండా సీరియల్స్‌తో నటుడిగా బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు శివకుమార్. అతడు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్తి, అన్నమలై సీరియల్స్ తెలుగులోకి డబ్ అయ్యాయి.
పిన్ని సీరియల్...
చిత్తి సీరియల్ పిన్ని పేరుతో జెమిని టీవీలో ప్రసారమైంది. 1999 నుంచి 2001 వరకు టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కృష్ణమ్మకు గోదారికి తోడేవరమ్మ అంటూ ఈ సీరియల్ టైటిల్ సాంగ్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
పిన్ని సీరియల్‌లో రాము అలియాస్ రామచంద్ర పాత్రలో శివకుమార్ నటించాడు. రాధిక శరత్‌కుమార్‌కు రెండో భర్తగా ఆమెకు అండగా నిలిచే పాత్రలో పాజిటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో శివకుమార్ నటించాడు. జెమిని టీవీలో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు శివకుమార్.
శివయ్య...
పిన్ని తర్వాత రాధిక శరత్‌కుమార్ తో అన్నమలై సీరియల్ చేశాడు శివకుమార్. ఈ సీరియల్‌లో టైటిల్ పాత్రలో శివకుమార్ కనిపిచాడు. అన్నమలై సీరియల్ తెలుగులో శివయ్య పేరుతో డబ్ అయ్యింది. 2002 నుంచి 2005 వరకు మూడేళ్ల పాటు జెమిని టీవీలో ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యింది. పిన్ని స్థాయిలో శివయ్య సీరియల్ ఆదరణను సొంతం చేసుకోలేకపోయింది.