Payal Rajput | స్టేజ్ పైనే రెచ్చిపోయిన పాయల్.. ప్రియుడితో లిప్‌లాక్
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టి.. తొలి సినిమాలోనే విపరీతంగా అందాలు ఆరబోసిన నటి పాయల్ రాజ్‌పుత్. ఇప్పుడు మరో ఘాటు ముద్దుతో ఆమె వార్తల్లో నిలిచింది.
కళ్లు చెదిరే అందంతోపాటు అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనుకాడకుండా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది పాయల్ రాజ్‌పుత్. ఆమె నటించిన ఫస్ట్ మూవీ ఆర్ఎక్స్100తోనే యూత్ మనసు కొల్లగొట్టింది. ఆ మూవీలో కార్తికేయతో కలిసి నటించిన ఆమె.. ఎన్నో బోల్డ్ సీన్లలో కనిపించింది. ఆ మూవీ హిట్ అయింది. ఆమె రేంజ్ కూడా పెరిగిపోయింది.
ఆ తర్వాత ఆర్డీఎక్స్ లవ్ అంటూ మరో ఆర్డీఎక్స్ పేల్చింది. అందులోనూ తనదైన స్టైల్లో అందాలు ఆరబోసినా.. సినిమా మాత్రం బోల్తాకొట్టింది. అప్పటి నుంచి ఆమెకు సరైన హిట్ దక్కలేదు. వెంకటేశ్‌తో కలిసి వెంకి మామలో నటించినా లాభం లేకపోయింది. మాస్ మహారాజ రవితేజతో డిస్కో రాజాలోని నటించింది. అయితే ఆర్ఎక్స్100లాంటి హిట్ మాత్రం ఆమెకు ఇంకా దక్కలేదు.
కానీ ఆమె మాత్రం ఏదో ఒకలా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రాతో కలిసి స్టేజ్‌పైనే లిప్‌లాక్‌తో రెచ్చిపోయింది. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండేళ్ల కిందట వాలెంటైన్స్ డే సందర్భంగా పాయల్.. తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. అతనితో ఎన్నో ఏళ్లుగా ఆమె డేటింగ్లో ఉంది. ముంబైలో టీవీ నటిగా ఉన్నప్పటి నుంచే వీళ్లు రిలేషన్షిప్లో ఉన్నారు.
వీళ్లు ఢిల్లీలో ఒకే స్కూళ్లో చదివారు. వాళ్లిద్దరి కుటుంబాలు కూడా సన్నిహితంగానే ఉంటాయి. వీళ్ల రిలేషన్‌షిప్‌ను కూడా ఇప్పటికే అంగీకరించాయి. దీంతో ఈ జంట పబ్లిగ్గానే రెచ్చిపోతోంది. ఈమధ్య జరిగిన ఓ స్టేజ్ షోలో ఇద్దరూ కలిసి పర్ఫామ్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్ ముగిసిన తర్వాత పాయల్.. తన ప్రియుడికి స్టేజ్‌పైనే పెదాలపై ముద్దు పెట్టడంతో అక్కడున్న వాళ్లంతా షాక్ తిన్నారు.
సంబంధిత కథనం
టాపిక్