Action comedy OTT: ఓటీటీలోకి మ్యూజికల్ యాక్షన్ కామెడీ మూవీ, సన్నీ లియోన్ కీలక పాత్ర
Sunny Leone Movie in OTT: పేట్టా రాప్ మూవీ ఎట్టకేలకి పలు వాయిదాల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. ప్రభుదేవా, వేదికతో పాటు సన్నీ లియోన్ నటించిన ఈ సినిమా.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
ప్రభుదేవా మ్యూజికల్ యాక్షన్ కామెడీ మూవీ పేట్టా రాప్ మంగళవారం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబరు 27న విడుదలైన ఈ తమిళ్ సినిమా.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
ఎస్‌జే సిను దర్శకత్వం వహించిన ఈ పేట్టా రాప్ మూవీలో సన్నీ లియోన్ ఒక కీలక పాత్ర పోషించింది. వాస్తవానికి ఈ సినిమా నవంబరు 8న ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్నట్లు తొలుత ప్రచారం జరిగినా.. వాయిదాపడింది. ఇప్పుడు నవంబరు 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
పేట్టా రాప్ కథ ఏంటంటే?
సినిమా యాక్టర్ కావాలనే ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలా (ప్రభుదేవా).. దాదాపు 100కి పైగా ఆడిషన్స్ ఇచ్చినా ఒక్క ఛాన్స్ కూడా అతనికి దక్కదు. దాంతో అందరూ అతడ్ని హేళన చేస్తూ మాట్లాడటంతో.. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో అతనికి జానకి (వేదిక) పరిచయం అవుతుంది. సింగరైన ఆమె.. బాలా కలని నెరవేర్చేందుకు ఎలా సాయ పడింది? ఇద్దరూ తమ కలని నెరవేర్చుకుంటారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
పేట్టా రాప్‌ను జోబి నిర్మించగా.. పి.సామ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రభుదేవా, సన్నీ లియోన్, వేదికతో పాటు వివేక్ ప్రసన్న, భగవతి పెరుమాళ్, రమేష్ తిలక్, జయప్రకాష్, రియాజ్ ఖాన్, మైమ్ గోపి, కళాభవన్ షాజోన్, రాజీవ్ పిళ్లై తదితరులు నటించారు.
నటుడిగా ప్రభుదేవా బిజీ
కొరియోగ్రాఫర్‌గా బిజీగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ, డైరెక్షన్ వైపు వచ్చిన ప్రభుదేవా.. సౌత్‌లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. విజయ్‌తోఈ ఏడాది గోట్, శివ రాజ్‌కుమార్‌తో ఒక సినిమాలోనూ ప్రభుదేవా నటించాడు. మలయాళంలోనూ అతనికి సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
పేట్టా రాప్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబరు 12 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. తమిళంతోనేకాదు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కానుంది.