OTT Tamil Comedy: ఓటీటీల్లోకి లేటెస్ట్‌గా రెండు తమిళ కామెడీ చిత్రాలు.. డిఫరెంట్ స్టోరీలతో.. తెలుగులోనూ స్ట్రీమింగ్-perusu streaming on netflix ott with bold story line sweetheart in jiohotstar tamil comedy movies latest films ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Tamil Comedy: ఓటీటీల్లోకి లేటెస్ట్‌గా రెండు తమిళ కామెడీ చిత్రాలు.. డిఫరెంట్ స్టోరీలతో.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Tamil Comedy: ఓటీటీల్లోకి లేటెస్ట్‌గా రెండు తమిళ కామెడీ చిత్రాలు.. డిఫరెంట్ స్టోరీలతో.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Tamil Comedy Movies: ఓటీటీల్లోకి ఈ వారం రెండు తమిళ కామెడీ సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. డిఫరెంట్ స్టోరీలైన్‍లతో ఈ చిత్రాలు ఉన్నాయి. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ సినిమాలు ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..

OTT Tamil Comedy: ఓటీటీల్లోకి లేటెస్ట్‌గా రెండు తమిళ కామెడీ చిత్రాలు.. డిఫరెంట్ స్టోరీలతో.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఓటీటీల్లో కొత్త కామెడీ సినిమాలు చూడాలనుకునే వారికి ఈ వారం రెండు తమిళ చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. డిఫరెంట్ స్టోరీలతో ఈ చిత్రాలు తెరకెక్కాయి. ఈ వారమే ఈ రెండు సినిమాలు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. అవే ‘పెరుసు’, ‘స్వీట్‍హార్ట్’ చిత్రాలు. తెలుగు డబ్బింగ్‍లోనూ స్ట్రీమ్ అవుతున్నాయి. ఈ సినిమాలు ఏ ఓటీటీలోకి వచ్చాయో, స్టోరీలైన్, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

పెరుసు

పెరుసు మూవీ ఈ శుక్రవారం ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీలో వైభవ్, సునీల్ రెడ్డి, నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ తమిళ కామెడీ మూవీ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

స్టోరీలైన్: ఊరు పెద్ద అయిన పరందామయ్య చనిపోతాడు. అయితే ఆయన అంగం స్థంభించి ఉంటుంది. ఇది ఎవరైనా గమనిస్తే పరువు పోతుందని, ఆ విషయాన్ని దాచేందుకు పరందామయ్య కొడుకులు నానాతిప్పలు పడతారు. ఈ డిఫరెంట్ స్టోరీలైన్‍తో పెరుసు మూవీ తెరకెక్కింది.

పెరుసు చిత్రానికి ఇలాంగో రామ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని స్టోన్‍బీచ్ ఫిల్మ్స్, బేవాజా స్టూడియోస్, ఎంబర్‌లైట్ స్టూడియో పతాకాలు నిర్మించగా.. అరుణ్ రాజ్ సంగీతం అందించారు. మార్చి 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. తెలుగు ఆడియోలోనూ స్ట్రీమ్ అవుతోంది.

స్వీట్‍హార్ట్

తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా స్వీట్‍హార్ట్ సినిమా కూడా ఏప్రిల్ 11వ తేదీనే జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రంలో రియోరాజ్, గోపిక రమేశ్ లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమాకు స్వీనిత్ సుకుమార్ దర్శకత్వం వహించారు.

మార్చి 14న థియేటర్లలో రిలీజైన స్వీట్‍హార్ట్ చిత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమాకు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా నిర్మాతగా ఉండడంతో పాటు సంగీతం కూడా అందించారు.

స్వీట్‍హార్ట్ స్టోరీలైన్: వాసు (రియో రాజ్), మను (గోపిక రమేశ్) ప్రేమించుకుంటారు. ఆ ఇద్దరూ ఓసారి రొమాన్స్ చేసుకుంటుంటే మను తల్లిదండ్రులు చూస్తారు. కొన్నాళ్లకు మనస్పర్థలతో వాసు, మను విడిపోతారు. అయితే, తాను ప్రెగ్నెంట్ అయ్యానని బ్రేకప్ తర్వాత మనుకు తెలుస్తుంది. వాసుకు చెబుతుంది. ఆ తర్వాత వారేం చేశారు.. ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. చివరికి ఏమైందనేదే స్వీట్‍హార్ట్ సినిమా స్టోరీ. ఈ మూవీని ఇప్పుడు జియోహాట్‍స్టార్ ఓటీటీలో చూడొచ్చు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం