Perusu OTT Release: ఓటీటీలోకి ఎన్నో రకాల సినిమాలు నిత్యం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. అలా ఓటీటీలోకి సరికొత్త తమిళ అడల్ట్ కామెడీ డ్రామా చిత్రం రానుంది. అదే పెరుసు. తమిళం నాట రీసెంట్‌గా థియేటర్లలో రిలీజ్ అడల్ట్ కామెడీ డ్రామా జోనర్ మూవీ పెరుసు.
ఈ ఏడాది మార్చి 14న థియేటర్లలో విడుదైలన పెరుసు మూవీకి ఇలాంగో రామ్ దర్శకత్వం వహించారు. ఇలాంగో రామ్, బాలాజీ జయరామ్ కథ అందించారు. అయితే, ఇదివరకు ఇలాంగో రామ్ తెరకెక్కించిన టెంటిగో అనే శ్రీలంకన్ మూవీ ఆధారంగా పెరుసు చిత్రాన్ని రూపొదించారు. కార్తికేయన్ సంతానం, హర్మన్ బేవజా, హిరణ్య పెరెరా నిర్మాతలుగా వ్యవహరించారు.
పెరుసు సినిమాలో రియల్ లైఫ్ బ్రదర్స్ అయిన హీరో వైభవ్, యాక్టర్ సునీల్ రెడ్డి నటించారు. అది కూడా అన్నదమ్ముల్లుగే ఈ రియల్ లైఫ్ బ్రదర్స్ యాక్ట్ చేయడం విశేషం. వీరిద్దరితోపాటు పెరుసు సినిమాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్, డిజిటల్ క్రియేటర్ నిహారిక ఎన్ఎమ్ కీలక పాత్ర పోషించింది. పెరుసు మూవీనే నిహారిక డెబ్యూ మూవీ. నేరుగా తమిళ ఇండస్ట్రీతో సినిమాల్లోకి అడుగుపెట్టింది నిహారిక ఎన్ఎమ్.
అలాగే, పెరుసు మూవీలో బాలా శరవణన్, మునిష్ కాంత్, చాందిని తమిళరసన్, రెడిన్ కింగ్స్‌లీ, వీటి గణేష్, దీపా శంకర్, స్వామినాథన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మార్చి 14 థియేటర్లలో విడుదలైన పెరుసు మంచి టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్‌లో ఈ సినిమా కథ, కథనం, మేకింగ్ బాగున్నాయని ప్రశంసలు కురిశాయి.
కాస్తా అడల్ట్ డైలాగ్‌లోతో క్లీన్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా పెరుసుని చిత్రీకరించారు. అందుకే పెరుసు మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి ఏకంగా 10కి 8.2 రేటింగ్ వచ్చింది. ఇలాంటి పెరుసు ఓటీటీలోకి వచ్చేయనుంది. అది కూడా తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ వంటి నాలుగు భాషల్లో పెరుసు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో పెరుసు ఓటీటీ రిలీజ్ కానుంది. అంటే, సుమారు థియేట్రికల్ రిలీజ్‌కు నెల రోజుల్లో పెరుసు ఓటీటీలోకి వచ్చేయనుంది. మరి కోలీవుడ్‌లో విశేషమైన ఆదరణ పొందిన పెరుసు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
ఇక పెరుసు కథ విషయానికొస్తే.. హలసాయంకు ఇద్దరు కుమారులు ఉంటారు. అతనే వారి గ్రామ పెద్దగా ఉంటాడు. ఆ గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చిన తోటివారితో కలిసి పరిష్కరిస్తుంటాడు హలసాయం. అయితే, ఓరోజు హలసాయం అనుకోకుండా విచిత్రమైన రీతిలో, బయటకు చెప్పలేని స్థితిలో మరణిస్తాడు.
హలసాయం మరణం వారి కుటుంబసభ్యులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంది. ఆ సమస్య నుంచి హలసాయం కుటుంబం ఏ విధంగా బయటపడిందనేదే పెరుసు కథ. హలసాయం ఎలా చనిపోయాడు, ఎలాంటి స్థితితో చనిపోయాడు కుటుంబం గౌరవాన్ని అతని కుమారులు ఎలా కాపాడారు అంత్యక్రియలు ఎలా చేశారు అనే ఆసక్తికర విషయాలో సాగే సినిమానే పెరుసు.
సంబంధిత కథనం
టాపిక్