Kannada Golden Star: కన్నడ గోల్డెన్ స్టార్‌తో ప్రభాస్ నిర్మాతల మూవీ పీఎమ్ఎఫ్49.. డైరెక్టర్‌గా కొరియోగ్రాఫర్!
People Media Factory Movie With Kannada Golden Star: తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడ గోల్డెన్ స్టార్‌గా పిలవబడే గణేష్‌తో సినిమా చేయనుంది. ప్రభాస్ ది రాజా సాబ్ నిర్మాత అయిన టీజీ విశ్వప్రసాద్ పీఎమ్ఎఫ్49కు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు.
People Media Factory Movie With Kannada Golden Star PMF49: శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్‌తో తెలుగు అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ సినిమా చేయనుంది. కన్నడ గోల్డెన్ స్టార్ గణేష్ నటించిన కృష్ణం ప్రణయ సఖి మూవీ ఇటీవల 100 రోజులు జరుపుకుంది. ఈ సినిమాతో థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్నాడు గణేష్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలు
ఇప్పుడు గణేష్ తన కొత్త సినిమా గురించి చెబుతూ అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు. గణేష్ అప్ కమింగ్ కన్నడ చిత్రం కోసం ప్రతిష్టాత్మకమైన తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కోలాబ్రెట్ అవుతున్నాడు. కార్తికేయ 2, వెంకీ మామ, ఓ బేబీ, ధమాకా, న్యూ-సెన్స్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు చిత్ర పరిశ్రమకు గణనీయమైన సహకారం అందించింది.
కన్నడ ఇండస్ట్రీ పట్ల
అలాగే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ది రాజా సాబ్ అనే హారర్ కామెడీ మూవీని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇప్పుడు #PMF49 ప్రాజెక్ట్‌తో కన్నడ మూవీ చేస్తున్నారు. ఇందుకోసం వారు కన్నడలో గోల్డెన్ స్టార్‌గా పిలవబడే గణేష్‌ను లీడ్ రోల్‌గా తీసుకున్నారు. ఈ సినిమాతో గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించడమే కాకుండా కన్నడ ఇండస్ట్రీ పట్ల తమ నిబద్ధతను చాటారు.
అపారమైన సామర్థ్యాన్ని
ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నేతృత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హై క్యాలిటీ స్టొరీ టెల్లింగ్, అత్యాధునిక నిర్మాణం ద్వారా కన్నడ సినిమాను మరో లెవల్‌కి తీసుకువెళ్లడానికి అంకిత భావంతో ఉన్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కన్నడ సినిమా అపారమైన సామర్థ్యాన్ని ఒక బిగ్ స్టేజ్‌పై ప్రెజెంట్ చేయాలనే వారి లక్ష్యాన్ని తెలియజేస్తోంది.
డైరెక్టర్‌గా కొరియోగ్రాఫర్
ఈ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ బి. ధనంజయ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అలాగే, ఈ చిత్రం యూనిక్ అండ్ లార్జ్ దెన్ లైఫ్ స్టొరీగా ఉండనుందని మేకర్స్ తెలిపారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా టైటిల్, నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేయనున్నారు.
ఇదివరకే శ్రీమురళితో
ఇదిలా ఉంటే, ఇదివరకు కన్నడ స్టార్ హీరో, ఉగ్రం, భగీరా ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీమురళి పుట్టిన రోజు అయిన డిసెంబర్ 17న ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అయితే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గతంలో అమెరికాలో అధ్యక్ష, ఆద్య అనే కన్నడ సినిమాలను నిర్మించింది.