Movies Effect: సినిమాల ఇన్సిపిరేషన్‌తో చేసిన వింత పనులు.. ఐపీఎస్ అవ్వడం నుంచి 80 కేజీల బంగారం, 50 లక్షల దొంగతనం వరకు!
People Did Strange Things Who Inspired From Movies: ఇటీవల లక్కీ భాస్కర్ మూవీ చూసి నలుగురు విద్యార్థులు హాస్టల్ గోడ దూకి పారిపోయిన విషయం తెలిసిందే. అలా సినిమాలు చూసి మోటివేట్ లేదా ప్రభావితం అయి చేసిన కొన్ని వింత పనులను ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో ఐపీఎస్ అవ్వడం నుంచి బ్యాంక్ దొంగతనం వరకు ఉన్నాయి.
People Did Strange Things Who Motivated From Movies: సినిమా అనేది వినోదం, కాలక్షేపం కోసం చూసేదే అయినా అది ఎన్నో రకాలుగా ఆడియెన్స్‌ను ప్రభావితం చేస్తుంది. మరికొన్ని మెసేజ్ ఒరియెంటెడ్ మూవీస్ అయితే మోటివేషన్ లేదా ఇన్‌స్పైర్ చేస్తాయి. అయితే, మూవీస్ ప్రభావం మంచి లేదా చెడు వంటి రెండు రకాలుగా ఉంటుంది.
సినిమాల ప్రభావం
అందుకు ఉదాహరణే ఇటీవల లక్కీ భాస్కర్ సినిమా చూసి నలుగురు విద్యార్థులు హాస్టల్ నుంచి పారిపోవడం. ఇలా ఈ నలుగురు విద్యార్థుల్లాగా సినిమాలను చూసి ఇన్‌స్పైర్ అయ్యో లేదా ప్రభావితం చెందో మనుషులు చేసిన కొన్ని వింత లేదా మంచి, చెడు పనులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
లక్కీ భాస్కర్ మోటివేషన్
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లక్కీ భాస్కర్ మూవీ చూసి విశాఖ ఆంటోనీ బోర్డింగ్ హోమ్‌లో ఉంటూ విద్యనభ్యసించే నలుగురు విద్యార్థులు పారిపోయారు. ఆ సినిమా ఇచ్చిన మోటివేషన్‌తో త్వరగా డబ్బు సంపాదించాలని, కారు, బంగ్లా, బంగారం వంటివి కొనాలన్న కలలు కన్నారు. అందుకే బ్యాగులు సర్దుకుని చెప్పపెట్టకుండా హాస్టల్ గోడ దూకి పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టి విద్యార్థుల ఆచూకి తెలుసుకున్నారు.
కాఖా కాఖా ఇన్సిపిరేషన్
వెంకటేష్ సూపర్ హిట్ సినిమాల్లో ఘర్షణ ఒకటి. 2004లో వచ్చిన ఈ తెలుగు సినిమా 2003లో తెరకెక్కిన తమిళ ఫిల్మ్ కాఖా కాఖాకు రీమేక్. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఈ సినిమా ఇచ్చిన ఇన్సిపిరేషన్‌తో వారణాసిలోని ఓ విద్యార్థి ఐపీఎస్ అయ్యాడట.
23 ఏళ్ల వరుణ్ కుమార్ అనే విద్యార్థి డ్రీమ్స్ ఎలా నెరవేర్చుకోడానికి కాఖా కాఖా మూవీ దిక్సూచిలా ఉపయోగపడిందని చెప్పారు. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వరుణ్ కుమార్‌కు తమిళనాడు క్యాడర్‌లో పోస్టింగ్ రాగా.. ప్రస్తుతం తిరుచిరాపల్లి జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే ఓ డిస్టిక్ట్ మెజిస్ట్రేట్ కూడా కాఖా కాఖా మూవీ చూసి ఐపీఎస్ అవ్వాలని డిసైడ్ అయ్యారట.
పుష్ప మూవీ
అల్లు అర్జున్, రష్మిక మందన్నా, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని తెలిసిందే. అందులో కొన్ని సీన్స్ చూసి ప్రభావితం అయి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేందుకు విభిన్న ప్రయత్నాలు చేసినట్లు పలు వార్తలు వచ్చాయి. తిరుపతిలోని బాలపల్లి అడవిలో ఎర్ర చందనం దుంగలను పుష్ప సినిమా స్టైల్‌లో అంబులెన్స్‌లో అక్రమ రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
బ్యాంక్ దొంగతనం
2007 డిసెంబర్‌లో కేరళలోని మలప్పురం జిల్లా చేలాంబ్ర కేరళ గ్రామీణ బ్యాంక్ నుంచి నలుగురు దొంగలు 80 కేజీల బంగారం, రూ. 50 లక్షల డబ్బు చోరీ చేశారు. బ్యాంక్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటే, కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో రెస్టారెంట్ పెడతామని రెంట్‌కు తీసుకున్నారు. అది నిజంగా అనిపించేందుకు రెస్టారెంట్‌కు కావాల్సిన ఫర్నిచర్ కూడా పెట్టారు. లోపల రెన్నోవేషన్ జరుగుతుందని బోర్డ్ పెట్టి, షట్టర్ ఎప్పుడు క్లోజ్ చేసి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌కు కన్నం పెట్టారు.
ధూమ్ 2 ఇన్సిపిరేషన్
సరిగ్గా బ్యాంక్ హాలీడే అయిన ఆదివారం చూసి ఎవ్వరూ లేనప్పుడు బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌లోకి ప్రవేశించి గ్యాస్ కట్టింగ్ మిషన్‌తో అన్ని లాకర్స్ తెరచి గోల్డ్, డబ్బులు కొట్టేశారు. అంతేకాకుండా పోలీసులను నక్సలైట్స్ వైపుకు మళ్లీంచేందుకు జై మావో అని గోడలపై రాశారు. సరిగ్గా రెండు నెలలకు పోలీసులు ట్రాక్ చేసి దొంగలను పట్టుకున్నారు.