Pelli Kani Prasad Review: పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ- కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ- హీరోగా సప్తగిరి హిట్ అందుకున్నాడా?-pelli kani prasad review in telugu saptagiri priyanka sharma telugu comedy movie rating and generates hilarious fun ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pelli Kani Prasad Review: పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ- కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ- హీరోగా సప్తగిరి హిట్ అందుకున్నాడా?

Pelli Kani Prasad Review: పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ- కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ- హీరోగా సప్తగిరి హిట్ అందుకున్నాడా?

Sanjiv Kumar HT Telugu

Pelli Kani Prasad Movie Review In Telugu And Rating: కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ పెళ్లి కాని ప్రసాద్. ప్రియాంక శర్మ హీరోయిన్‌గా, అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇవాళ (మార్చి 21) విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో పెళ్లి కాని ప్రసాద్ రివ్యూలో తెలుసుకుందాం.

పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

టైటిల్: పెళ్లి కాని ప్రసాద్

నటీనటులు: సప్తగిరి, ప్రియాంక శర్మ, మురళిధర్ గౌడ్, అన్నపూర్ణ, ప్రమోదిని, వడ్లమాని శ్రీనివాస్, మీసాల లక్ష్మణ్ తదితరులు

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి

నిర్మాతలు: కేవై బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల

బ్యానర్: థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్

సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్

విడుదల: ఎస్‌వీసీ

సినిమాటోగ్రఫీ: సుజాత సిద్దార్థ్

సంగీతం: శేఖర్ చంద్ర

ఎడిటర్: మధు

విడుదల తేది: 21 మార్చి, 2025

Pelli Kani Prasad Review Telugu And Rating: కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పెళ్లి కాని ప్రసాద్. మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ పాత్ర పేరుతో వచ్చిన ఈ సినిమాలో సప్తగిరికి జోడీగా ప్రియాంక శర్మ హీరోయిన్‌గా చేసింది.

అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన పెళ్లి కాని ప్రసాద్ ఇవాళ (మార్చి 21) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి పెళ్లి కాని ప్రసాద్ మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

మలేషియాలోని ఓ స్టార్ హోటల్‌లో 38 ఏళ్ల ప్రసాద్ (సప్తగిరి) పని చేస్తుంటాడు. తండ్రి (మురళీధర్ గౌడ్) చెప్పిన పూర్వీకుల రెండు కోట్ల కట్నం చరిత్ర విని అంతకంటే తక్కువ కట్నం తీసుకోకూడదని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ఈ క్రమంలో ప్రసాద్‌కు ప్రియ (ప్రియాంక శర్మ) పరిచయం అవుతుంది.

తన తల్లిదండ్రులు, అమ్మమ్మతో కలిసి ఫారెన్‌లో సెటిల్ అవ్వాలని కలలు కంటుంది ప్రియ. అయితే, ప్రసాద్ గురించి తెలిసి అతన్ని ట్రాప్ చేసి ప్రియ పెళ్లి చేసుకుంటుంది. వివాహం తర్వాత ఫారెన్ వెళ్లకూడదని ప్రసాద్ నిర్ణయించుకుంటాడు. దీంతో ఇద్దరు గొడవపడతారు. ప్రసాద్ ఫారెన్ ఎందుకు వెళ్లకూడదని అనుకున్నాడు? దానికి గల కారణం ఏంటీ? పెళ్లి కాని ప్రసాద్ పెళ్లాడి ఎలాంటి కష్టాలు పడ్డాడు? వంటి విషయాలు తెలియాలంటే ఈ పెళ్లి కాని ప్రసాద్‌ను చూడాల్సిందే.

విశ్లేషణ:

తెలుగులో ఇప్పటివరకు పెళ్లి చుట్టూ రాసుకున్న కథతో ఎన్నో సినిమాలు చూశాం. పెళ్లి కాని ప్రసాద్ మూవీ కూడా అంతే. టైటిల్ చూస్తేనే అర్థం అవుతోంది. ఏజ్ బార్ హీరో పెళ్లి కష్టాలు, వివాహం చుట్టూ సినిమా ఉంటుందని. మరోవైపు విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునే హీరోయిన్, అందుకోసం ఏజ్ బార్ వ్యక్తితే ప్రేమ, పెళ్లితో ట్రాప్ చేయడం వంటి అంశాలతో రంగరించారు.

నవ్వించే ఉద్దేశంతో

ఆ తర్వాత హీరో ఫారెన్ వెళ్లకూడదని ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ప్రసాద్ ఇచ్చిన షాక్‌తో హీరోయిన్ ఏం చేసింది, హీరో ఎందుకు ఫారెన్ వెళ్లకూడదని అనుకున్నాడు వంటి కథతో సినిమా సాగుతుంది. అయితే, స్టోరీ రొటీన్‌గా అనిపించిన డైరెక్టర్ టేకింగ్ ఆకట్టుకునేలా ఉంది. ఆడియెన్స్‌ను నవ్వించే ఉద్దేశంతోనే సినిమాను రాసుకున్నట్లు తెలుస్తోంది.

కామెడీ-ఎమోషనల్

అయితే, కొన్ని చోట్ల కామెడీ చాలా బాగా పేలింది. క్లైమాక్స్ పర్వాలేదు. కానీ, కాస్తా జాగ్రత్తలు పాటిస్తే ఇంకా బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక సప్తగిరి ఫుల్ లెంత్ ఎంటర్‌టైన్ చేశాడు. సినిమాను తన భుజాన వేసుకుని మోశాడు. కామెడీ టైమింగ్‌లో, ఎమోషనల్ సీన్స్‌తో అలరించాడు. మురళీధర్ గౌడ్ పాత్రకు మంచి స్కోప్ ఉంది. ఆయన బాగా చేశారు.

సంగీతం-విజువల్స్

ప్రియాంక శర్మ ఆకట్టుకుంది. గ్లామర్‌గా అట్రాక్ట్ చేసింది. ఇక అన్నపూర్ణ, ప్రమోదిని పాత్రలు నవ్వించాయి. వీరితోపాటు పాషాతో వచ్చే ట్రాక్ అలరిస్తుంది. ఇక శేఖర్ చంద్ర సంగీతం బాగుంది. బీజీఎమ్ పర్వాలేదు. ముఖ్యంగా చాలా సీన్స్ లో ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా వాడిన మీమ్ కంటెంట్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాను రిచ్‌గా చూపించారు.

ఫైనల్‌గా చెప్పాలంటే

ఫైనల్‌గా చెప్పాలంటే సందేశం ఇచ్చే అంశాలు ఉన్నప్పటికీ ఎక్కువ వాటిపై ఫోకస్ పెట్టలేదు. కేవలం నవ్వించే ప్రయత్నంగానే ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించారు. కథ లేకున్నా డైలాగ్స్‌తో కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ఈ పెళ్లి కాని ప్రసాద్.

రేటింగ్: 3/5

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం