Pekamedalu Movie: ఆనందం అత్తకు స్వాహా మనశాంతి మామకు స్వాహా - పేక మేడ‌లు సెకండ్ సింగిల్ లిరిక్స్ ఇవే!-pekamedalu movie second song telugu lyrics rakesh varre vinod kishan comedy movie releasing june 19th on theaters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pekamedalu Movie: ఆనందం అత్తకు స్వాహా మనశాంతి మామకు స్వాహా - పేక మేడ‌లు సెకండ్ సింగిల్ లిరిక్స్ ఇవే!

Pekamedalu Movie: ఆనందం అత్తకు స్వాహా మనశాంతి మామకు స్వాహా - పేక మేడ‌లు సెకండ్ సింగిల్ లిరిక్స్ ఇవే!

Nelki Naresh Kumar HT Telugu
Jul 04, 2024 02:19 PM IST

Pekamedalu Movie: పేక‌మేడ‌లు మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజైంది. ఆనందం అత్తకు స్వాహా మనశాంతి మామకు స్వాహా ఆడదాని జన్మంతా స్వాహా అంటూ లిరిక్స్‌తో సాగిన ఈ పాట యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోంది.

పేక‌మేడ‌లు మూవీ
పేక‌మేడ‌లు మూవీ

Pekamedalu Movie: వినోద్ కిష‌న్‌, అనూష కృష్ట జంట‌గా న‌టిస్తోన్న పేక మేడ‌లు మూవీ జూలై 19న థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. 'ఆనందం అత్తకు స్వాహా మనశాంతి మామకు స్వాహా ఆడదాని జన్మంతా స్వాహా' అంటూ సాగే ఈ సాంగ్‌ను సింగర్ సాకే రాజశేఖర్ పాడాడు. భార్గవ కార్తీక్ సాహిత్యాన్ని అందించారు. స్మరణ్ సాయి మ్యూజిక్ అందించాడు. ఫ‌న్నీ లిరిక్స్‌తో హుషారుగా ఈ పాట సాగింది.

yearly horoscope entry point

హీరో ప్రొడ్యూస‌ర్‌గా...

బాహుబ‌లి, ఎవరికి చెప్పొద్దు సినిమాల ఫేమ్ రాకేష్ వ‌ర్రే పేక మేడ‌లు సినిమాను ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. నీల‌గిరి మామిళ్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. పేక మేడ‌లు ప్ర‌మోష‌న్స్‌ను మేక‌ర్స్ డిఫ‌రెంట్‌గా చేస్తోన్నారు.

ఈ సినిమా ప్రమోషన్ల కోసం తమ వద్ద డబ్బు లేదని, ప్రేక్షకులు సాయం చేయాలని కోరుతూ ఇటీవ‌ల హీరో వినోద్ కిష‌న్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు.ప్రేక్ష‌కులు ఇచ్చిన డ‌బ్బును రిలీజ్ అయ్యాక వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తానని వినోద్ కిష‌న్ ఈ వీడియోలో పేర్కొన్నాడు. రూ.5, రూ.10 అయినా పర్లేదని అన్నారు. క్యూర్ కోడ్ స్కాన్ చేసి డబ్బు పంపాలని ఈ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో వైర‌ల్ అయ్యింది.

ల‌క్ష్మ‌ణ్ డ‌బ్బు క‌ష్టాలు...

పేక మేడ‌లు మూవీలో ల‌క్ష్మ‌ణ్ అనే యువ‌కుడిగా వినోద్ కిష‌న్ క‌నిపించ‌బోతున్నాడు. జీవితంలో డ‌బ్బు సంపాదించ‌డం కోసం అడ్డ దారులు తొక్కిన ల‌క్ష్మ‌ణ్‌కు ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి? ఆ క‌ష్టాల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడ‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.

జితేంద‌ర్‌రెడ్డి మూవీ...

వినోద్ కిష‌న్‌కు హీరోగా తెలుగులో ఇదే ఫ‌స్ట్ మూవీ. డ‌బ్బింగ్ మూవీస్ నా పేరు శివ‌, అంధ‌గారం సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాడు వినోద్ కిష‌న్‌. ఇటీవ‌ల రిలీజైన విశ్వ‌క్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రిలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన రోల్‌లో క‌నిపించాడు. మ‌రోవైపు పేక మేడ‌లు ప్రొడ్యూస‌ర్ రాకేష్ వ‌ర్రే హీరోగా జితేంద‌ర్‌రెడ్డి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. తెలంగాణ‌లోని జ‌గిత్యాల‌కు చెందిన పొలిటిక‌ల్ టీడ‌ర్ జితేంద‌ర్‌రెడ్డి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. జితేంద‌ర్‌రెడ్డి మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

సాంగ్ లిరిక్స్ ఇవే...

ఆనందం అత్తకి స్వాహా..

మనః శ్శాంతి మామకి స్వాహా

మొగుడికి నువు మొత్తంగా స్వాహా.. ఓయమ్మ..

ఆడదాని జన్మంతా స్వాహా

అమమ్మా అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ.. ఆడదాని జన్మంతా స్వాహా..

ఆనందం అత్తకి స్వాహా,, మనః శ్శాంతి మామకి స్వాహా

మొగుడికి నువు మొత్తంగా స్వాహా..

ఓయమ్మ ఆ జన్మంతా స్వాహా అమ్మమ్మా.. అమ్మమ్మా.. అమ్మమ్మా.. అమ్మమ్మా..

ఆడదాని జన్మంతా స్వాహా.. ఆహా.. ఆహా.. ఓహో.. ఓహె..

చదువంటే చాల్లే అంటరు..

ఉద్యోగం ఊహు అంటరు..

చదువంటే చాల్లే అంటరు..

ఉద్యోగం ఊహూ అంటరు..

సొంతంగా బ్రతికే వీకే.. సాంతం లాగేసుకుంటరు...

పెళ్ళంటే లచ్చలు పోతారే..!

ఊరంతా.. అలివిగాని అప్పులు చేస్తారే..!

అమ్మమ్మా.. అమ్మమ్మా... అమ్మమ్మా... అమ్మమ్మా..

అరువు తీరక ఉరి పోగేత్తారే..

ఆహా.. ఆహా.. ఓహో..ఓహో.. ఓహో.. ఓహో.. ఆహా.. ఆహా...

పండగొస్తే అలకల మేళా..

అల్లుడే నెగ్గేటి లీల..

పండగొస్తే అలకల మేళా..

అల్లుడే నెగ్గేటి లీల..

కానుకల్లో- మర్యాదల్లో.. లోట్లు వస్తే ఇల్లు గుల్ల..

కాపురం ఓ తరాసు లెక్కమ్మా.

.ఓయమ్మ.. తెలియకుంటే తిరకాసేనమ్మా..

అమ్మమ్మా.. అమ్మమ్మా.. అమ్మమ్మా.. అమ్మమ్మా..

లెక్కకందని తిసేనమ్మా

ఆహా.. ఆహా.. ఓహో.. ఓహో.. ఓహో.. ఓహో.. ఆహా.. ఆహా..

నలుగురిలో విలువేమౌద్ది! పదుగురిలో పరువేమౌద్ది..?

నలుగురిలో విలువేమౌద్ది!

పదుగురిలో పరువేమౌద్ది..?

సంసారం వీధిన పడితే.. లోకం ఏ తీరున చూస్తది..!

సర్దుకుంటే తప్పేంటంటారే..!?

ఓ యమ్మా.. దిక్కుమాలిన తత్వం చెబుతారే..

నీ జన్మ... జీవమున్న సమాధి చేస్తారే..

అమ్మమ్మా.. అమ్మమ్మా..

అమ్మమ్మా సాంప్రదాయం ముసుగే ఏత్తారే..

ఆహా.. ఆహా.. ఓహోూ.. ఓహో.. ఆహా.. ఆహా..

ఓహోూ.. ఓహో.. ఓహో.. ఓహోూ..

ఆహా.. ఆహా.. ఆహా.. ఆహా.. ఓహో.. ఓహో..

యుగాలుగా జరిగే ఈ వింత నాటకాన... నీ రాత రాసే హక్కు మగాడిదే అయితే. నిను ఆదరించే దిక్కే లేదమ్మా.. ఓ ఆడజన్మా.. నిను ఆదరించే దిక్కే లేదమ్మా..

Whats_app_banner