మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగిపోయింది. రస్టిక్ రగెడ్ లుక్‍లో చెర్రీ అదిరిపోయారు. ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ చిత్రానికి ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. మంచి హైప్ ఉన్న పెద్ది సినిమాకు అప్పుడే ఆడియో రైట్స్ డీల్ కూడా జరిగిపోయింది.
పెద్ది సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ సంస్థ సొంతం చేసుకుంది. రూ.25కోట్లకు ఈ మూవీ ఆడియో రైట్స్ తీసుకుంది ఆ పాపులర్ ఆడియో కంపెనీ. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఆడియో హక్కుల విషయంలో రామ్‍చరణ్ కెరీర్లో అది అత్యధిక మొత్తంగా ఉంది. గేమ్ ఛేంజర్ చిత్రం ఆడియో హక్కులు సుమారు రూ.23కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు పెద్ది ఆడియో రైట్స్ రూ.25కోట్లు పలికాయి. దీంతో చెర్రీ సోలో హీరోగా చేసిన సినిమాల ఆడియో హక్కుల్లో ఇదే హయ్యెస్ట్‌గా నిలిచింది.
పెద్ది సినిమా గ్లింప్స్ వీడియో మరో నాలుగు రోజుల్లో ఏప్రిల్ 6వ తేదీన రానుంది. శ్రీరామనవమి రోజున ఈ గ్లింప్స్ అడుగుపెట్టనుంది. గ్లింప్స్ డేట్‍పై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. పెద్ది మూవీ నుంచి ఇటీవలే వచ్చిన రామ్‍చరణ్ లుక్ అదిరిపోయింది. పొడవు జుట్టు, గుబురు గడ్డం, చెవిపోగు, ముక్కుపోగుతో మాస్‍గా లుక్ ఉంది. దీంతో గ్లింప్స్ ఎలా ఉంటుందోననే ఆసక్తి విపరీతంగా ఉంది. ఏప్రిల్ 6 కోసం ప్రేక్షకులు క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు. గ్లింప్స్ ద్వారా రిలీజ్ డేట్ ఏమైనా వెల్లడవుతుందా అనే ఉత్కంఠ కూడా ఉంది.
పెద్ది సినిమాను రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో పీరియడ్ స్పోర్డ్స్ యాక్షన్ డ్రామా మూవీగా డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో చరణ్ పాత్ర అద్భుతంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. కన్నడ సీనియర్ స్టార్ శివ రాజ్‍కుమార్, జగపతి బాబు, దివ్యయేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
పెద్ది సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన గేమ్ ఛేంజర్ సినిమాతో రామ్‍చరణ్‍కు ప్లాఫ్ ఎదురైంది. పెద్దితో చెర్రీ మళ్లీ బ్లాక్‍బస్టర్ కొడతారనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది.
సంబంధిత కథనం
టాపిక్