Peddi Glimpse Record: పెద్ది గ్లింప్స్ నేషనల్ రికార్డ్.. టాక్సిక్‍ను దాటేసి!-peddi glimpse first shot creates national wide record ram charan video beats yash toxic ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Peddi Glimpse Record: పెద్ది గ్లింప్స్ నేషనల్ రికార్డ్.. టాక్సిక్‍ను దాటేసి!

Peddi Glimpse Record: పెద్ది గ్లింప్స్ నేషనల్ రికార్డ్.. టాక్సిక్‍ను దాటేసి!

Peddi Glimpse Record: పెద్ది గ్లింప్స్ నేషనల్ వైడ్‍గా రికార్డు సృష్టించింది. టాక్సిక్‍ను దాటేసి హిస్టరీ క్రియేట్ చేసింది. భారీ వ్యూస్‍తో సత్తాచాటింది.

Peddi Glimpse Record: పెద్ది గ్లింప్స్ నేషనల్ రికార్డ్.. టాక్సిక్‍ను దాటేసి..

గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రం నుంచి వచ్చి గ్లింప్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఈ ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోకు పూర్తిగా పాజిటివ్ స్పందన దక్కింది. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 6) మేకర్స్.. పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ఏకంగా నేషనల్ రేంజ్‍లో రికార్డు సృష్టించింది.

రికార్డు ఇదే

పెద్ది సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోకు ఒకే యూట్యూబ్ ఛానెల్‍లో 24 గంటల్లో 36.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయని మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 7) అధికారికంగా వెల్లడించింది. ఈ లెక్కతో ఓ పోస్టర్ కూడా రివీల్ చేసింది. ఈ గణాంకాన్ని బట్టి ఇండియాలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న గ్లింప్స్‌గా పెద్ది వీడియోకు రికార్డు దక్కింది.

యశ్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమా గ్లింప్స్ వీడియోకు 24 గంటల్లో 36 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పటి వరకు ఇండియాలో 24 గంటల్లో అత్యధిక గ్లింప్స్ వ్యూస్ రికార్డు ఆ చిత్రం పేరిట ఉండేది. పెద్ది తెలుగు గ్లింప్స్ 24 గంటల్లో 36.5 మిలియన్ వ్యూస్ దక్కించుకొని టాక్సిక్ రికార్డు బద్దలుకొట్టింది. నేషనల్ వైడ్‍లో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.

వేర్ ఈజ్ పుష్ప అంటూ 2023లో వచ్చిన పుష్ప 2 గ్లింప్స్ హిందీలో 24 గంటల్లో 27.6 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇది ప్రస్తుతం నేషనల్ వైడ్‍లో మూడో ప్లేస్‍లో ఉంది. దేవర గ్లింప్స్ 26.17 మిలియన్లతో నాలుగో స్థానంలో ఉండగా.. రీజనల్ మూవీ అయిన గుంటూరు కారం గ్లింప్స్ 24 గంటల్లో 20.98 మిలియన్ వ్యూస్‍తో ఐదో స్థానంలో ఉంది.

రామ్‍చరణ్ లుక్, క్రికెట్ షాట్‍కు ఫిదా

పెద్ది గ్లింప్స్‌లో రామ్‍చరణ్ మాస్ రస్టిక్ లుక్ అదిరిపోయింది. చెర్రీ యాక్టింగ్, స్వాగ్, స్క్రీన్ ప్రెజన్స్ సూపర్ అనిపించాయి. ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్ కూడా మెప్పించింది. ఇక చరణ్ క్రీజు నుంచి బయటికి వచ్చి క్రికెట్ బ్యాట్ హ్యాండిల్ నేలకు అనించి మరీ లేచి కొట్టిన షాట్ ప్రేక్షకులతో వావ్ అనిపిస్తోంది. గ్లింప్స్ చివర్లో ఉండే ఈ షాట్ విపరీతంగా నచ్చేసింది. చాలా వైరల్ అవుతోంది. అంచనాలకు మించి మెప్పించిన పెద్ది గ్లింప్స్ వ్యూస్‍లో దుమ్మురేపి.. రికార్డు క్రియేట్ చేసింది.

పెద్ది మూవీ హిందీ గ్లింప్స్ నేడు రిలీజైంది. హిందీలోనూ చరణ్ డబ్బింగ్ చెప్పారు. హిందీలో కూడా ఈ గ్లింప్స్ మంచి వ్యూస్ దక్కించుకునే ఛాన్స్ ఉంది.

పెద్ది సినిమాకు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. గ్లింప్స్‌లో తన టేకింగ్‍తో అదరగొట్టారు. చిత్రంపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఈ మూవీలో రామ్‍చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివ రాజ్‍కుమార్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.

పెద్ది చిత్రాన్ని 2026 మార్చి 27వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకం ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సమర్పిస్తున్నాయి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం