శ్రీ రామ నవమి రోజు మెగా ఫ్యాన్స్ సందడి మరో రేంజ్ లో ఉండబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ గ్లింప్స్ రేపే (ఏప్రిల్ 6) రిలీజ్ కాబోతోంది. ఫస్ట్ షాట్ పేరుతో ఈ మూవీ గ్లింప్స్ ను మేక్సర్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ గ్లింప్స్ ను చూశాక రామ్ చరణ్ చేసిన కామెంట్స్ మరింత హైప్ పెంచేస్తున్నాయి.
‘పెద్ది’ గ్లింప్స్ అదిరిపోయిందని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియోలో ‘పెద్ది’ గ్లింప్స్ కోసం ఏఆర్ రెహమాన్ స్టూడియోలో సౌండ్ మిక్సింగ్ చేస్తున్నట్లు కనిపించింది. డైరెక్టర్ బుచ్చిబాబు సాన దగ్గరుండి మరీ పనులన్నీ చూసుకుంటున్నారు. ఈ పాన్ ఇండియా మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే.
‘‘పెద్ది గ్లింప్స్ చూశాక సూపర్ ఉత్సాహంగా ఉంది. ఏఆర్ రెహమాన్ సార్ కు స్పెషల్ క్రెడిట్ ఇవ్వాలి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. పెద్ది ఫస్ట్ షాట్ రేపు ఉదయం 11.45 గంటలకు రిలీజ్ అవుతుంది’’ అని ఇన్ స్టాగ్రామ్ లో రామ్ చరణ్ వీడియో షేర్ చేశారు. ఈ ఫస్ట్ షాట్ కోసం డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశానని ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రామ్ చరణ్ తెలిపారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మాలయాళ భాషల్లో ఒకేసారి ఈ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయనున్నారు.
బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ గ్లింప్స్ ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. అయితే ముందుగా ప్లాన్ చేసినా గ్లింప్స్ మాత్రం రిలీజ్ కాలేదు.
మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల అనారోగ్యం ఆసుపత్రిలో చేరారు. గ్లింప్స్ లేటు కావడానికి అదే కారణమని తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రామ్ చరణ్ తేజ్ కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే టార్గెట్ తో ‘పెద్ది’ కోసం పని చేస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ ఊరమాస్ గా కనిపించి అంచనాలు పెంచేశారు. ఈ మూవీలో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సంబంధిత కథనం