Payal Rajput: ఈ సారి పాన్ ఇండియా టార్గెట్ - పాయల్ రాజ్‌పుత్ నెక్స్ట్ మూవీ లాంఛ్ ఎప్పుడంటే?
Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఓ పాన్ ఇండియన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు ముని దర్శకత్వం వహిస్తోన్నాడు. జనవరి 24న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ లాంఛ్ కాబోతోంది.
Payal Rajput: గత కొన్నాళ్లుగా సినిమాల వేగాన్ని తగ్గించింది పాయల్ రాజ్‌పుత్. 2024 ఏడాదిలో కేవలం ఒకే ఒక మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. వరుస పరాజయాల కారణంగా కథల ఎంపికలో తన స్టైల్ మార్చేసింది ఈ బ్యూటీ. డిఫరెంట్ కాన్సెప్ట్‌లు, ఛాలెంజింగ్ రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఫిక్సైంది.
పాన్ ఇండియన్ మూవీ...
తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఓ పాన్ ఇండియన్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు ముని కథ, స్క్రీన్‌ప్లేతో పాటు డైరెక్షన్ చేస్తోన్నాడు. టికెట్ ఎంటర్టైన్‌మెంట్స్, అర్జున్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 24న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. పాయల్ రాజ్‌పుత్ పాన్ ఇండియన్ మూవీ లాంఛింగ్ ఈవెంట్‌కుపలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు ప్రారంభోత్సవ వేడుకలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.
డిఫరెంట్ వేరియేషన్స్...
కమర్షియల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్ పాత్ర డిఫరెంట్ వేరియేషన్స్‌లో చాలా ఎమోషనల్ గా ఉండబోతుందని సమాచారం. యాక్టింగ్‌తో పాటు గ్లామర్‌కు స్కోప్ ఉన్న పాత్ర చేస్తోన్నట్లు చెబుతోన్నారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం తర్వాత హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్‌కు మంచి హిట్టిచ్చే మూవీ అవుతోందని ఆశాభావం వ్యక్తం చేస్తోన్నారు.
త్రీ రోజెస్ వెబ్‌సిరీస్‌లో...
కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం త్రీ రోజెస్ వెబ్‌సిరీస్ సీజన్ 2లో నటిస్తోంది. బోల్డ్ కాన్పెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ త్వరలో ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ వెబ్‌సిరీస్‌లో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు ఈషా రెబ్బా, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్‌పుత్. ఇందులో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించింది. తొలి సినిమాలోనే తన గ్లామర్ తళుకులతో యూత్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారింది.
రొటీన్ కాన్సెప్ట్‌లు...
ఆర్ ఎక్స్ 100 బ్లాక్‌బస్టర్‌తో పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. వెంకీ మామ, డిస్కోరాజా, ఆర్‌డీఎక్స్ లవ్‌తో పాటు తెలుగులో చాలా సినిమాలు చేసింది. రొటీన్ కాన్సెప్ట్‌ల కారణంగా ఈ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. గోల్‌మాల్ మూవీతో త్వరలోనే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీలో జీవా హీరోగా నటిస్తోన్నాడు.