Payal Rajput: ట్రైబల్ గర్ల్‌గా పాయల్ రాజ్‌పుత్ - ఆరు భాషల్లో వెంకటలచ్చిమి రిలీజ్
Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ వెంకటలచ్చిమి పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తోంది. రివేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముని దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ ఆరు భాషల్లో రిలీజ్ కాబోతోంది.
Payal Rajput: ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ట్రైబల్ గర్ల్ అవతారం ఎత్తబోతున్నది. ఛాలెంజింగ్ రోల్‌తో తెలుగు ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా వెంకటలచ్చిమి పేరుతో కొత్త మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఈ సినిమాకు ముని దర్శకత్వం వహిస్తోన్నాడు. రివేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆరు భాషల్లో రిలీజ్ కాబోతోంది. తె లుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలతో పాటు పంజాబీలోనూ మేకర్స్ వెంకటలచ్చిమి మూవీని విడుదల చేయబోతున్నారు.
వెంటకటచ్చిమిగా నా పేరు...
వెంకట లచ్చిమి ప్రారంభోత్సవ వేడుకలో పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ “మంగళవారం సక్సెస్ తర్వాత చాలా కథలు విన్నాను. కానీ అవేవి నా మనసుకు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాను. డైరెక్టర్ ముని వెంకటలచ్చిమి కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నా పేరు వెంకటలచ్చిమిగా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్ట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. హీరోయిన్‌గా నా కెరీర్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళుతుందనే నమ్మకముంది” అని తెలిపింది.
ట్రైబల్ గర్ల్‌గా...
“వెంకటలచ్చిమి కథ రాసుకునేటప్పుడే పాయల్ రాజ్‌పుత్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారనిపించింది. ట్రైబల్ గర్ల్ గా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో పాయల్ రాజ్‌పుత్ కనిపిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా ఆరు భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాం. అన్ని భాషల్లో హిట్టవుతుందనే నమ్మకముంది” అని డైరెక్టర్ ముని తెలిపాడు.
త్వరలో షూటింగ్...
త్వరలోనే వెంకటలచ్చిమి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ పాన్ ఇండియన్ మూవీని రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. వికాస్ బాడిస మ్యూజిక్ అందిస్తోన్నాడు. వెంకట లచ్చిమిలో టాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
టాలీవుడ్‌లోకి ఎంట్రీ…
ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్‌పుత్, అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలవడంతో పాయల్ టాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. వెంకీమామ, డిస్కోరాజాతో పాటు పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. అవకాశాలు భారీగానే వచ్చిన అదృష్టం మాత్రం కలిసిరాలేదు.
మంగళవారంతో…
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారంతో లాంగ్ గ్యాప్ తర్వాత హిట్టు అందుకున్నది. ఈ సినిమాలో లైంగిక పరమైన సమస్యలతో బాధపడే అమ్మాయిగా అసమాన నటనను కనబరిచింది. గత ఏడాది రక్షణ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించింది.