Maya Petika OTT: మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ మాయా పేటిక మూవీ-payal rajput maya petika movie to stream in etv win ott too movie already streaming in aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maya Petika Ott: మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ మాయా పేటిక మూవీ

Maya Petika OTT: మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ మాయా పేటిక మూవీ

Hari Prasad S HT Telugu
May 15, 2024 02:20 PM IST

Maya Petika OTT: పాయల్ రాజ్‌పుత్ నటించిన మాయా పేటిక మూవీ మరో ఓటీటీలోకి కూడా వస్తోంది. ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఈటీవీ విన్ కూడా స్ట్రీమింగ్ చేయనుంది.

మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ మాయా పేటిక మూవీ
మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ మాయా పేటిక మూవీ

Maya Petika OTT: థియేటర్లలో రిలీజైన సుమారు 11 నెలల తర్వాత ఇప్పుడు మరో ఓటీటీలోకి వస్తోంది పాయల్ రాజ్‌పుత్ నటించిన మాయా పేటిక మూవీ. ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో తెలుగు వారికి దగ్గరైన పాయల్ నటించిన ఈ మూవీ.. గతేడాది సెప్టెంబర్ లోనే ఆహా ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈటీవీ విన్ కూడా ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది.

ఈటీవీ విన్ ఓటీటీలోకి మాయా పేటిక

పాయల్ రాజ్‌పుత్ నటించిన మాయా పేటిక మూవీ గురువారం (మే 16) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా బుధవారం (మే 15) అనౌన్స్ చేసింది. "సెల్ ఫోన్ రాసిన కథలు" అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఈటీవీ విన్ వెల్లడించింది. ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్ తోపాటు బేబీ మూవీ ఫేమ్ విరాజ్ అశ్విన్ కూడా నటించాడు.

సిమ్రత్ కౌర్, సునీల్, శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమైన పాత్రలు పోషించారు. గతేడాది జూన్ లో రిలీజైన ఈ సినిమా సెప్టెంబర్ 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడిదే సినిమాను ఇన్నాళ్ల తర్వాత ఈటీవీ విన్ ఓటీటీ కూడా తీసుకోవడం ఆశ్చర్యం కలిగించేదే. పైగా థియేటర్లలోనూ ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కొత్త కథ అయినా దానిని ఆసక్తికరంగా తెరకెక్కిండచడంలో మేకర్స్ విఫలమయ్యారు.

మాయా పేటిక సినిమా ఏంటంటే?

మాయాపేటిక కథ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. నిజానికి ఇది ఆరు చిన్న కథల ఆంథాలజీ. ఓ మొబైల్ ఫోన్ ద్వారా వీళ్లు కనెక్ట్ అవుతారు. ఆ మొబైల్ ఈ ఆరు పాత్రల చేతులు ఎలా మారుతుంది? అది వీళ్ల జీవితాలను ఎలా మారుస్తుందన్నది అసలు కథ. మాయాపేటిక మూవీ స్టోరీ ఇంట్రెస్టింగా ఉన్నా దానిని ఆకట్టుకునేలాగా తీయడంలో విఫలమవడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఈ మూవీ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగి సినిమాపై అంచనాలను పెంచింది. ఈ ప్రపంచంలో మనుషులకు నాలుగు అవసరాలు ఉంటాయి.. ప్రేమ, డబ్బు, అధికారం, నేను అంటూ మొబైల్ ఫోన్ ను చూపిస్తారు. ఓ చెత్త బుట్టలో పడి ఉన్న ఆ ఫోన్ ఆ పాత్రల జీవితాలను ఎలా మార్చబోతుందన్నది ట్రైలర్ లో చూడొచ్చు. ఇది ఫోన్ కాదు మాయాపేటిక అనే ఓ డైలాగ్ కూడా ఉంటుంది.

పాయల్ రాజ్‌పుత్ ఈ మధ్యే మంగళవారం అనే సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ కూడా నిరాశ పరిచినా.. బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించింది. ఈ మంగళవారం మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక ఈటీవీ విన్ ఓటీటీ విషయానికి వస్తే ఈ మధ్యే ఆ ఓటీటీలో పార్థు, చిత్రం చూడరా, ప్రణయ విలాసంలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చాయి.

Whats_app_banner