Mangalavaram Movie:మూడు ఫార్మెట్స్‌లో మంగ‌ళ‌వారం బ్లాక్‌బ‌స్ట‌ర్ - బుల్లితెర‌పై కుమ్మేసిన‌ అజ‌య్ భూప‌తి థ్రిల్ల‌ర్ మూవీ-payal rajput ajay bhupathi mangalavaram movie gets 8 3 trp rating for first tv premiere ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mangalavaram Movie:మూడు ఫార్మెట్స్‌లో మంగ‌ళ‌వారం బ్లాక్‌బ‌స్ట‌ర్ - బుల్లితెర‌పై కుమ్మేసిన‌ అజ‌య్ భూప‌తి థ్రిల్ల‌ర్ మూవీ

Mangalavaram Movie:మూడు ఫార్మెట్స్‌లో మంగ‌ళ‌వారం బ్లాక్‌బ‌స్ట‌ర్ - బుల్లితెర‌పై కుమ్మేసిన‌ అజ‌య్ భూప‌తి థ్రిల్ల‌ర్ మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Feb 28, 2024 06:04 AM IST

Mangalavaram Movie: థియేట‌ర్‌, ఓటీటీలో ప్రేక్ష‌కుల్ని మెప్పించిన మంగ‌ళ‌వారం మూవీ బుల్లితెర‌పై అద‌ర‌గొట్టింది. మంగ‌ళ‌వారం టీవీ ప్రీమియ‌ర్‌కు 8.3 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చిన‌ట్లు యూనిట్ తెలిపింది.

మంగ‌ళ‌వారం మూవీ
మంగ‌ళ‌వారం మూవీ

Mangalavaram Movie: ఓ చిత్ర విజయానికి పెద్ద తారలు, భారీ బడ్జెట్, కమర్షియల్ విలువల కంటే కంటెంట్ ముఖ్యమని ఇటీవ‌లే రిలీజైన పాయ‌ల్ రాజ్‌పుత్ మంగ‌ళ‌వారం మూవీ మ‌రోసారి నిరూపించింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన ఈ మూవీ థియేట‌ర్‌, ఓటీటీతో పాటు బుల్లితెర‌పై అద‌ర‌గొట్టింది. మంగ‌ళ‌వారం మూవీ ఫ‌స్ట్ టీవీ ప్రీమియ‌ర్‌కు అదిరిపోయే టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది. ఇటీవ‌ల స్టార్ మా ఛాన‌ల్‌లో మంగ‌ళ‌వారం మూవీ టెలికాస్ట్ అయ్యింది. ఈ వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ 8.3 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చిన‌ట్లు సినిమా యూనిట్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల కాలంలో స్టార్‌మాలో ప్రీమియ‌ర్ అయిన సినిమాల్లో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ద‌క్కించుకున్న మూవీగా మంగ‌ళ‌వారం నిలిచింది. టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా స్టార్ హీరోల సినిమాలను మంగ‌ళ‌వారం దాటేసింది.

నిర్మాత‌ల‌కు లాభాలు..

మంగ‌ళ‌వారం సినిమాలో పాయ‌ల్ రాజ్‌పుత్‌తో పాటు ప్రియ‌ద‌ర్శి, చైత‌న్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషించారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

సెక్సువ‌ల్ డిజార్డ‌ర్ పాయింట్‌తో ప్ర‌యోగాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఆకట్టుకునే ట్విస్టులు, అదిరిపోయే సంగీతం, కెమెరా పనితనం ఈ మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. థియేట‌ర్ల‌లో హిట్టైన ఈ మూవీ ఆ త‌ర్వాత డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ద్వారా ఓటీటీలోకి వ‌చ్చింది. ఓటీటీలో కూడా మంగ‌ళ‌వారం మూవీ రికార్డ్ వ్యూస్‌ను ద‌క్కించుకున్న‌ది. బుల్లితెర‌పై 8.3 టీఆర్‌పీ రేటింగ్ ద‌క్కించుకున్న‌ది. ఎలాంటి పెద్ద నటుడు లేకపోయినా విడుదలయిన మూడు ఫార్మాట్ లలో మంగ‌ళ‌వారం మూవీ మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న‌ది.

మంగ‌ళ‌వారం క‌థ ఇదే...

మ‌హాల‌క్ష్మిపురంలో అక్ర‌మ సంబంధాలు పెట్టుకున్న జంట‌లు వ‌రుస‌గా హ‌త్య‌ల‌కు గుర‌వుతుంటారు.ఆ హ‌త్య‌ల మిస్ట‌రీని ఛేదించే బాధ్య‌త‌ను పోలీస్ ఆఫీస‌ర్ మాయ చేప‌డుతుంది. ఆ హ‌త్య‌ల వెనుక ఎవ‌రున్నారు? ఈ మ‌ర్డ‌ర్స్‌తో ఊరి నుంచి వెలివేయ‌బ‌డిన శైల‌జ‌కు ఏమైనా సంబంధం ఉందా? శైలును చంపింది ఎవ‌రు? ఆమె ద‌య్య‌మై తిరుగుతుంద‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారంలో నిజం ఉందా? లేదా? అన్న‌దే మంగ‌ళ‌వారం మూవీ క‌థ‌.

ఆర్ఎక్స్ 100 త‌ర్వాత‌...

అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్ఎక్స్ 100 మూవీతోనే పాయ‌ల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బోల్డ్ క్యారెక్ట‌ర్‌తో తొలి అడుగులోనే యూత్ ఆడియెన్స్‌ను మెప్పించింది. మ‌ళ్లీ ఆ స్థాయి స‌క్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురుచూసిన పాయ‌ల్ నిరీక్ష‌ణ‌కు మంగ‌ళ‌వారం మూవీతో తెర‌ప‌డింది. పాయ‌ల్ రాజ్‌పుత్ గ్లామ‌ర్ పాత్ర‌లు మాత్ర‌మే చేయ‌గ‌ల‌ద‌నే ముద్ర‌ను చెరిపివేస్తూ ఆమెలోని యాక్టింగ్ కోణాన్ని మంగ‌ళ‌వారం మూవీలో ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి చూపించారు. సెక్సువ‌ల్ డిజార్డ‌ర్‌తో బాధ‌ప‌డే యువ‌తిగా పాయ‌ల్ రాజ్‌పుత్ యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

స్టార్ హీరోతో నెక్స్ట్ మూవీ...

ఆర్ఎక్స్ 100 మూవీతో ద‌ర్శ‌కుడిగా మారిన అజ‌య్ భూప‌తి తొలి సినిమాతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఆ త‌ర్వాత శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌ల‌తో మ‌హా స‌ముద్రం సినిమా చేశారు. ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా మిగిలింది. మంగ‌ళ‌వారం మూవీతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్‌లోకి ఎక్కిన అజ‌య్ భూప‌తి ఓ స్టార్ హీరోతో డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో మూవీ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే అత‌డి నెక్స్ట్ మూవీపై క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం.

Whats_app_banner