ఓజస్ గంభీరగా థియేటర్లను షేక్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. ‘ఓజీ’ సినిమాతో తన కెరీర్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లో ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే. సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో పవన్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా అదరగొట్టారు. ఇప్పటికే ఓజీ యూనివర్స్ లో ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని సుజీత్ అనౌన్స్ చేశాడు.
ఓజీ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమా ఫ్రాంఛైజీపై మేకర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఓజీ యూనియర్స్ లో ఇంకా సినిమాలు వస్తాయని స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇందులో నటిస్తానని కూడా ఆయన అన్నారు. మరోవైపు ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని సుజీత్ కూడా స్పష్టం చేశారు. ఇప్పుడీ ఓజీ యూనివర్స్ లో పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా భాగం కాబోతున్నాడనే వార్త సంచలనంగా మారింది.
భారీ కటౌట్ తో హీరోలా ఎదిగిపోయాడు పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్. అతని డెబ్యూ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సుజీత్ కామెంట్లు వైరల్ గా మారాయి. అమెరికాలోని డల్లాస్ లో ఓజీ మూవీ స్క్రీనింగ్ సమయంలో సుజీత్ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో వెళ్లి ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూశాడు సుజీత్. అప్పుడు ఓజీ ప్రీక్వెల్ లో అకీరా ఉంటాడా? అని సుజీత్ ను అడిగాడు. ‘ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ ఉండదు’ అని నవ్వుతూ చెప్పేశాడు. దీంతో ఓజీ యూనివర్స్ లో అకీరా కన్ఫామ్ అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
రీసెంట్ గా వచ్చిన ఓజీ మూవీ ‘ఓజీ యూనివర్స్’లో ఒక పార్ట్ మాత్రమే అని సుజీత్ క్లారిటీగా చెప్పాడు. ఈ యూనివర్స్ లో ప్రీక్వెల్, సీక్వెల్ రెండూ వస్తాయన్నాడు. సినిమాలో గంభీర తండ్రి సుభాష్ చంద్రబోస్ కథ, జపాన్ లోని యాకూజా యుద్ధాలు లాంటివన్నీ చూపిస్తామని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఓజీ ప్రీక్వెల్ తో అకీరా నందన్ ఎంట్రీ ఖాయమైన ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు.
ఓజీ యూనియర్స్ లో అకీరా నందన్ కూడా ఉంటాడనే టాక్ మరింత పెరిగిపోయింది. అయితే అది ఎప్పుడనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. సుజీత్ నెక్ట్స్ నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేయబోతున్నాడు. దసరా సందర్భంగా ఈ మూవీ లాంఛ్ అయింది. ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత సుజీత్ మళ్లీ ఓజీ యూనివర్స్ పై పని చేసే అవకాశముంది.
సంబంధిత కథనం