పవన్ కల్యాణ్ సినిమా నుంచి అదిరిపోయే అప్‍డేట్.. హనుమాన్ జయంతి రోజున..-pawan kalyan ustaad bhagat singh official update revealed on hanuman jayanti shooting will start soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  పవన్ కల్యాణ్ సినిమా నుంచి అదిరిపోయే అప్‍డేట్.. హనుమాన్ జయంతి రోజున..

పవన్ కల్యాణ్ సినిమా నుంచి అదిరిపోయే అప్‍డేట్.. హనుమాన్ జయంతి రోజున..

పవన్ కల్యాణ్ సినిమా నుంచి వరుసగా అప్‍డేట్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే విషయం బయటికి వచ్చింది. దీంతో అభిమానులు సంబరపడుతున్నారు.

పవన్ కల్యాణ్ సినిమా నుంచి అదిరిపోయే అప్‍డేట్.. హనుమాన్ జయంతి రోజున..

ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన లైనప్‍‌లో ఉన్న సినిమాలను శరవేగంగా పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఓజీ మూవీ చిత్రీకరణలోనూ పాల్గొంటున్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి అప్‍డేట్ ఇచ్చింది. నేడు (మే 22) అఫీషియల్‍గా విషయాన్ని చెప్పింది మూవీ టీమ్.

త్వరలో షూటింగ్

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుందంటూ మూవీ టీమ్ నేడు వెల్లడించింది. పవన్ కల్యాణ్‍కు ఇష్టదైవమైన హనుమంతుడి జయంతి అయిన ఈ అప్‍డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. “పవర్ స్టార్ బెస్ట్‌ను సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి. హరీశ్ శంకర్ రాసి, దర్శకత్వం వహించే ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్నో ఏళ్లు సెలెబ్రేట్ చేసుకునేలా, గుర్తుండిపోయేలా ఉంటుంది. షూటింగ్ త్వరలో మొదలవుతుంది. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు” అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది మైత్రీ మూవీ మేకర్స్.

పవన్ సుతుని జయంతి రోజున అంటూ..

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జూన్ 12వ తేదీన మళ్లీ మొదలవుతుందని ఇటీవల కొన్ని రూమర్లు వినిపించాయి. ఇప్పుడు త్వరలో అంటూ అధికారికంగా మూవీ టీమ్ చెప్పింది. దీంతో అదే రోజున షూటింగ్ షురూ అయ్యేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన సుతుని జయంతి రోజున.. పవన్ కల్యాణ్ సినిమా నుంచి భారీ అప్‍డేట్ అంటూ దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.

గబ్బర్ సింగ్ కాంబో.. సూపర్ క్రేజ్

పవన్ కల్యాణ్ - డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‍‍లో 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ బ్లాక్‍బస్టర్ అయింది. పవన్ కెరీర్లో అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. వీరిద్దరి కాంబో సుమారు 13 ఏళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్‍తో రిపీట్ అవుతోంది. దీంతో ఈ చిత్రానికి చాలా క్రేజ్ ఉంది.

తమిళ మూవీ తేరికి రీమేక్‍గా ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందనే రూమర్లు ఉన్నాయి. అయితే, కథకు హరీశ్ శంకర్ చాలా మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

హరి హర వీరమల్లు, ఓజీపై క్లారిటీ

పీరియడ్ యాక్షన్ మూవీ హరి హర వీరమల్లు చిత్రం జూన్ 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడు క్రిష్ తప్పుకున్నాక జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి డైరెక్షన్ చేశారు. ఇటీవలే మరో సాంగ్ కూడా వచ్చింది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సుజీత్ దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్‍స్టర్ యాక్షన్ మూవీ ‘ఓజీ’ షూటింగ్‍లో ఇటీవలే మళ్లీ అడుగుపెట్టారు పవన్ కల్యాణ్. ఈ చిత్రం షూటింగ్‍ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ ఆలోచిస్తోంది. ఇక, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా త్వరలో షూరూ కానుంది. వరుస అప్‍డేట్లతో పవన్ అభిమానులు సంబరంలో ఉన్నారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం