Pawan Kalyan Turns Singer: కొత్త ట్రెండ్ సెట్ చేయనున్న పవన్ - హరిహరవీరమల్లు కోసం సింగర్‌గా మారనున్నాడు
Pawan Kalyan Turns Singer: హరిహరవీరమల్లు సినిమా కోసం హీరో పవన్ కళ్యాణ్ సింగర్‌గా మారబోతున్నాడు. ఈ పీరియాడికల్ మూవీలో ఓ సాంగ్‌ను పవన్ ఆలపించబోతున్నట్లు సమాచారం.
Pawan Kalyan Turns Singer: హీరోలు సింగర్స్‌గా మారడం అనే ట్రెండ్ ఇదివరకు చాలా కనిపించేది. కానీ బిజీ షెడ్యూల్స్ వల్లనో, ఇతర కారణాల వల్లనో ఈ మధ్య హీరోలు ఈ ట్రెండ్‌కు దూరంగా ఉంటున్నారు. పాటలు పాడటానికి ఆసక్తిని చూపడం లేదు. హరిహరవీరమల్లు సినిమాతో తిరిగి ఈ ట్రెండ్ మళ్లీ సెట్ చేయడానికి రెడీ అవుతోన్నాడు పవన్ కళ్యాణ్.
ట్రెండింగ్ వార్తలు
ఈ సినిమా కోసం సింగర్‌గా అవతారమెత్తబోతున్నట్లు సమాచారం. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్‌ను పవన్ కళ్యాణ్ పాడబోతున్నట్లు తెలిసింది. హరిహరవీరమల్లు సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తోన్నాడు. సినిమాలో ప్రత్యేక సందర్భంలో వచ్చే ఓ పాటకు పవన్ గళం అయితేనే బాగుంటుందని భావించిన కీరవాణి...ఈ సాంగ్ పాడమని పవర్‌స్టార్‌ను రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం.
కీరవాణి కోరిక మేరకు ఈ పాట పాడటానికి పవన్ అంగీకరించినట్లు చెబుతోన్నారు. త్వరలోనే ఈ సాంగ్‌ను రికార్డ్ చేయబోతున్నట్లు తెలిసింది. గతంలో జానీ, అత్తారింటికి దారేది సినిమాల్లో చిన్న బిట్ సాంగ్స్ మాత్రమే పవన్ కళ్యాణ్ పాడాడు. పూర్తి స్థాయి సాంగ్ పాడటం ఇదే మొదటిసారి అని తెలిసింది.
కాగా పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు క్రిష్ హరిహరవీరమల్లు సినిమాను రూపొందిస్తోన్నారు. ఇందులో మొఘలుల కాలం నాటి బందిపోటు దొంగగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు.
నిధి అగర్వాల్ హీరోయిన్‌గా కనిపించబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్రను పోషిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. మే నెలలో హరిహరవీరమల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభంకాబోతున్నట్లు సమాచారం. . జూలైలోగా షూటింగ్ పూర్తిచేసి దసరాకు సినిమాను రిలీజ్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు చెబుతున్నారు.