Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వాయిస్‌తో హరి హర వీరమల్లు ఫస్ట్ సింగిల్ - షూటింగ్ కంప్లీట్ డేట్ ఇదే!
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు నుంచి ఫస్ట సింగిల్ త్వరలో రాబోతోంది. ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెక్స్ట్ షెడ్యూల్‌తో పాటు షూటింగ్ కంప్లీట్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశాడు. వచ్చే ఏడాది మార్చి 28న హరి హర వీరమల్లు రిలీజ్ కాబోతోంది.
Pawan Kalyan: దసరా సందర్భంగా పవన్‌కళ్యాణ్ హరి హర వీరమల్లుపై మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్‌ను రివీల్ చేశారు. ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఫస్ట్ సింగిల్‌ను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడటం గమనార్హం.
ఆయన వాయిస్ పాటకు ప్రధానాకర్షణగా నిలువబోతున్నట్లు చెబుతోన్నారు. తెలుగులో పవన్ వాయిస్‌తో ఈ పాట రిలీజ్ అవుతోండగా...ఇతర భాషల్లో మాత్రం వేరే గాయకులు సాంగ్‌ను అలపించినట్లు మేకర్స్ ప్రకటించారు. గతంలో అత్తారింటికి దారేది, పంజా, గుడుంబా శంకర్‌తో పాటు తాను హీరోగా నటించిన పలు సినిమాల్లో బిట్ సాంగ్స్ పాడారు పవన్ కళ్యాణ్.
స్పెషల్ పోస్టర్...
దసరా సందర్భంగా హరి హర వీరమల్లు నుంచి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ప్రత్యర్థులపై శక్తి త్రిశూలాన్ని ప్రయోగించినట్లుగా మూడు బాణాలను గురిపెడుతూ పవన్ కళ్యాణ్ కనిపిస్తోన్నారు. పవన్ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
షూటింగ్ కంప్లీట్ ఎప్పుడంటే...
హరి హర వీరమల్లు షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. అక్టోబరు 14 నుంచి తదుపరి షెడ్యూల్ మొదలుకాబోతోంది. నవంబర్ 10 నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని సమాచారం.
ఇటీవల జరిగిన షెడ్యూల్‌లో హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ సారథ్యంలో ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కించారు. . పవన్ కళ్యాణ్‌తో పాటు 400 - 500 మంది ఆర్టిస్టులు పాల్గొన్నఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలవబోతున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.
పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్...
ప్రజలను పట్టి పీడిస్తోన్న సామ్రాజ్యవాదులు, అణచివేతదారులకు వ్యతిరేకంగా స్వేచ్ఛ, స్వాతం త్య్రం కోసం ఓ యోధుడు సాగించిన పోరాటం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా హరి హర వీరమల్లు మూవీ తెరకెక్కబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
బాబీ డియోల్ విలన్...
హరి హర వీరమల్లు మూవీలో బాలీవుడ్, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా నటిస్తోన్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా కనిపించబోతున్నది. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, సచిన్ ఖేడ్కర్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, మురళీశర్మ, అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
యాభై శాతం షూటింగ్ పూర్తి...
క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు షూటింగ్ మొదలైంది. దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత అనివార కారణాల వల్ల క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ హరి హర వీరమల్లు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. గతంలో నీ మనసు నాకు తెలుసు, అక్సిజన్‌తో పాటు మరికొన్ని సినిమాలకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.
రిలీజ్ ఎప్పుడంటే...
ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి హరి హర వీరమల్లు మూవీకి మ్యూజిక్ అందిస్తోన్నాడు.ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీస్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ ఈ మూవీకి వీఎఎఫ్ ఎక్స్ అందిస్తున్నారు.ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా మూవీ 2025, మార్చి 28న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.