Pawan Kalyan Sudheer Varma Movie: కెరీర్ ఆరంభం నుంచి ఏడాదికో సినిమా చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా స్పీడు పెంచారు. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ నాలుగింటిలో రెండు సెట్స్‌పై ఉండగా మరో రెండు సినిమాల షూటింగ్స్ త్వరలో మొదలుకానున్నాయి. ,తాజాగా పవన్ కళ్యాణ్ మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. యంగ్ డైరెక్టర్ సుధీర్‌వర్మతో ఓ సినిమా చేయబోతున్నాడు. రావణాసుర ప్రమోషన్స్‌లో పవన్‌కళ్యాణ్‌తో తాను సినిమా చేయనున్నది నిజమేనంటూ సుధీర్‌వర్మ వెల్లడించాడు. ,చాలా కాలం క్రితమే పవన్‌తో తన సినిమా ఫిక్సయిందని సుధీర్‌వర్మ అన్నాడు. ఈ సినిమా మెయిన్ స్టోరీ ఐడియా త్రివిక్రమ్‌దేనని అతడు చెప్పిన ఐడియాను డెవలప్ చేయడంతో పాటు ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించబోతున్నట్లు సుధీర్‌వర్మ చెప్పాడు. ,అయితే ఈ సినిమా సెట్స్‌పైకి రావడానికి సమయం పట్టవచ్చునని సుధీర్‌వర్మ పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ ప్రజెంట్ కమిట్‌మెంట్స్ తర్వాతే ఈ సినిమాపై షూటింగ్‌పై క్లారిటీ వచ్చే అవకాశముందని తెలిపాడు. ,పవన్ @ 4ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు, హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు చేస్తోన్నాడు పవన్‌కళ్యాణ్. అలాగే సముద్రఖని డైరెక్షన్‌లో వినోధయసీతమ్ రీమేక్‌కు పవన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ రీమేక్‌లో సాయిధరమ్‌తేజ్ మరో హీరోగా నటిస్తోన్నాడు. ,సాహో ఫేమ్ సుజీత్‌తో గ్యాంగ్‌స్టర్ సినిమా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. మరోవైపు రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన రావణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో రవితేజ కనిపించబోతున్నారు.