Pawan Kalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్‍కు వచ్చేందుకు పవన్ కల్యాణ్ ఓకే.. తేదీ, వేదిక ఇదే!.. స్పీచ్‍పై ఉత్కంఠ
Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు వచ్చేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఓకే చెప్పారు. ఈవెంట్ డేట్, వేదికను కూడా మేకర్స్ దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍పై చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్‍లో ఈవెంట్‍ను చరిత్ర సృష్టించేలా, మెగా ఈవెంట్‍లా నిర్వహిస్తామని నిర్మాత దిల్‍రాజు ఇటీవల చెప్పారు. దీంతో హైప్ విపరీతంగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. అమెరికాలో డల్లాస్‍లో ఇప్పటికే ఓ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఏపీలో భారీస్థాయిలో ఈవెంట్ నిర్వహించేందుకు మూవీ టీమ్ సిద్ధమైంది.
దిల్‍రాజు ఆహ్వానం.. ఓకే చెప్పిన పవన్
గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ముఖ్య అతిథిగా రావాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍ను నిర్మాత దిల్‍రాజు ఆహ్వానించారు. విజయవాడలో పవన్‍ను కలిసి ఈవెంట్‍కు పిలిచారు. ఈ ఈవెంట్‍కు హాజరయ్యేందుకు పవన్ అంగీకరించారు. దీంతో భారీ స్థాయిలో ఈ ఈవెంట్ ఉండే అవకాశం ఉంది. బాబాయి, అబ్బాయి పవన్, రామ్‍చరణ్‍ను ఒకే వేదికపై చూడొచ్చు. డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ హాజరుకానున్న తొలి మూవీ ఈవెంట్ ఇదే కానుంది.
ఈవెంట్ ఎక్కడంటే?
గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను జనవరి 4వ తేదీన రాజమండ్రిలో నిర్వహించాలని మూవీ టీమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. భారీ రేంజ్‍లో ఈ ఈవెంట్ చేయాలని భావిస్తున్నారు. తేదీ, వేదికపై త్వరలోనే యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ప్రసంగంపై ఉత్కంఠ
గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారనే విషయాలపై ఉత్కంఠ నెలకొని ఉంది. డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక ఆయన పాల్గొన్ననున్న తొలి సినీ ఈవెంట్ కావడంతో ఏ అంశాలపై ఆయన ప్రసంగం ఉంటుందనే విషంలో ఆసక్తి ఎక్కువగా నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ విషయంపై ఆయన ఏమైనా ఈ గేమ్ ఛేంజర్ ఈవెంట్‍లో మాట్లాడతారా అనేది కూడా చూడాలి. మొత్తంగా పవన్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన తీసుకురానున్నట్టు దిల్‍రాజు చెప్పారు. విజయవాడలో రామ్‍చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించారు. ఏపీలో ఈవెంట్ అత్యంత గ్రాండ్‍గా ఉంటుందని కూడా చెప్పారు. ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ అదరగొడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍చరణ్ సరసన కియారా అడ్వానీ నటించారు. ఎస్‍జే సూర్య, అంజలి, శ్రీకాంత్ కీరోల్స్ చేశారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు. దిల్‍రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమారు రూ.350కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందిందని అంచనా. ఈ చిత్రంలో ఐదు పాటల చిత్రీకరణకే రూ.75కోట్లు ఖర్చు చేశారు. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించారు.
సంబంధిత కథనం
టాపిక్