Pawan Kalyan Remuneration: ఓజీ మూవీ కోసం పవన్ కల్యాణ్‌కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. ఆ లిస్టులో చేరిన పవర్ స్టార్
Pawan Kalyan Remuneration: ఓజీ మూవీ కోసం పవన్ కల్యాణ్‌కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. ఈ దెబ్బతో పవర్ స్టార్ కూడా వంద కోట్ల పవర్ ఫుల్ లిస్టులో చేరిపోయాడు.
Pawan Kalyan Remuneration: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అతన్ని నమ్మి నిర్మాతలు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అవుతారు. అదే సమయంలో పవన్ డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి వెనుకాడరు. ఇప్పుడు పవన్ చేస్తున్న ఓజీ మూవీ కోసం కూడా అతనికి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కోసం తన కెరీర్లోనే తొలిసారి పవన్ కల్యాణ్ రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాడట. దీంతో ఇండియాలో రూ.100 కోట్లకుపైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల లిస్టులో పవర్ స్టార్ చేరిపోయాడు. సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో ఈ ఓజీ మూవీ వస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
నిజానికి ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడంతో అతడు కూడా బాగానే వెనుకేసుకున్నాడట. ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించిన డీవీవీ దానయ్య.. ఈ ఓజీ మూవీని నిర్మిస్తున్నాడు. పవన్ కు భారీ రెమ్యునరేషన్ తోపాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను కూడా భారీ ధరకు అమ్మనున్నట్లు సమాచారం.
ఈ ఓజీ మూవీలో పవన్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తోంది. ఇదొక గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సెట్స్ నుంచి ఇప్పటికే పవన్ కు సంబంధించిన ఫొటోలు కూడా వచ్చాయి. వీటిలో పవన్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది ఎన్నికల్లోపు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను అన్నింటినీ పూర్తి చేయాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ప్రస్తుతం అతడు ఈ ఓజీ మూవీతోపాటు బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ లలోనూ నటిస్తున్నాడు. బ్రో మూవీ జులై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కావచ్చు.
సంబంధిత కథనం