Chalore Chalore Song Lyrics In Telugu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్-డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చి సూపర్ హిట్ అయిన మూవీలో జల్సా ఒకటి. ఇలియానా, పార్వతి మిల్టన్, కమలిని ముఖర్జీ హీరోయిన్స్‌గా నటించారు.
తెలుగు రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరెకక్కిన జల్సా మూవీ 2008లో రిలీజ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన జల్సా మూవీ సాంగ్స్ ఇప్పటికీ చార్ట్ బస్టర్స్ హిట్ అని తెలిసిందే. జల్సా మూవీలోని అప్పట్లో ఒక ఊపు ఊపాయి.
ఇక కొన్ని పాటలు అయితే ఎంతో అర్థవంతంగా ఆలోచింపజేసేలా అలరించాయి. సందర్భానుసారం వచ్చే ఆ పాటలతో జల్సా మరో స్థాయికి వెళ్లింది. వాటన్నింటిలో స్ఫూర్తినింపేలా, మనిషిగా ఆలోచింజపచేసేలా ఓ పాట ఉంది. అదే ఛలోరే ఛలోరే సాంగ్.
నక్సలైట్‌గా అడవిలో సంజయ్ సాహు పాత్ర ప్రయాణం చేసే క్రమంలో వచ్చే ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది. అప్పుడు పవన్ కల్యాణ్ పడే ఆవేదన, ఎవరికి కనపడని ఆవేశం, చెప్పుకోలేని ఉద్వేగం అన్ని భావాలు ప్రతిబింబించేలా ఈ గీతం సాగుతుంది.
మరి ఈ పాట పాడుకునేలా ఛలోరే ఛలోరే లిరిక్స్ ఇక్కడ చూద్దాం.
ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా..
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా..
ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..
చంపనిదే బతకవని.. బతికేందుకు చంపమనీ..
నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారేటనీ..
ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..
సంహారం సహజమనీ.. సహవాసం స్వప్నమనీ..
తర్కించే తెలివికి తెలిసినా తానే తన శత్రువనీ..
ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..
నీ పయనం ఎక్కడికే నీకు తెలియాలిగా..
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా..
ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..
ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే..
వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే..
ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..
అపుడెపుడో ఆటవికం.. మరి ఇపుడో ఆధునికం..
యుగయుగాలుగా ఏ మృగాల కన్న ఎక్కువ ఏం ఎదిగాం..
ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..
రాముడిలా ఎదగగలం.. రాక్షసులను మించగలం..
రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం..
ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..
తారలనే తెంచగలం తలుచుకుంటే మనం..
రవికిరణం చీర్చగలం రంగులుగా మార్చగలం..
ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్.. ఛలోరే ఛలోరే ఛల్ ఛల్..
ఇదిలా ఉంటే, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఛలోరే ఛలోరే పాటకు ప్రముఖ గీతారచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. ఒక్కో పదం ఆణిముత్యంలా సీతారామశాస్త్రి రాసిన ఛలోరే ఛలోరే పాటను సింగర్ రంజిత్ ఆలపించారు.
సంబంధిత కథనం
టాపిక్