Pawan Kalyan in Unstoppable 2: బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అంటూ వచ్చి నిజంగానే సంచలనాలు క్రియేట్ చేసింది పవన్ కల్యాణ్ తో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్. ఇందులో తొలి పార్ట్ ఫిబ్రవరి 3నే వచ్చింది. ఊహించినట్లే అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. ఈ ఎపిసోడ్ స్ట్రీమ్ అయిన తొలి ఐదు నిమిషాల్లోనే అత్యధిక యాప్ డౌన్లోడ్స్ జరిగాయి.,ఇక ఇప్పుడు రెండో ఎపిసోడ్ వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 10) స్ట్రీమ్ కానుంది. ఈ ఎపిసోడ్ లో పవన్ పొలిటికల్ గా మరిన్ని హాట్ కామెంట్స్ చేయడంతోపాటు తాను డిప్రెషన్ తో పోరాడినప్పటి సంచలన విషయాలను కూడా వెల్లడించాడు. డిప్రెషన్ తో తాను చాలానే బాధపడినా.. ఎలాగోలా బయటపడినట్లు చెప్పాడు. అసలు 17 ఏళ్ల వయసులోనే చనిపోవాలని అనుకున్నా అంటూ పవన్ చెప్పడం గమనార్హం.,"నాకు ఆస్తమా ఉంది. అందువల్ల తరచూ హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతుండే వాడిని. అందుకే నేను ఎక్కువగా సమాజంలో కలిసే వ్యక్తిని కాను. 17 ఏళ్ల వయసులో పరీక్షల ఒత్తిడి నా డిప్రెషన్ ను మరింత పెంచింది. మా పెద్దన్న (చిరంజీవి) ఇంట్లో లేనప్పుడు ఆయన దగ్గర ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్ తో నా ప్రాణం తీసుకోవాలని కూడా అనుకున్నా" అని పవన్ చెప్పాడు.,అయితే తన చిన్నన్న (నాగబాబు), వదిన (సురేఖ) తనను కాపాడారని వివరించాడు. "తన కోసం బతకాల్సిందిగా మా పెద్దన్న చెప్పాడు. నువ్వేమీ చేయకపోయినా సరే అన్నాడు. కానీ దయచేసి ప్రాణాలతో ఉండు అని అన్నాడు. అప్పటి నుంచి నేను పుస్తకాలు చదవడం ప్రారంభించాను. మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను" అని పవన్ చెప్పుకొచ్చాడు.,నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు.. నీతో నువ్వే పోటీ పడు అంటూ యువతకు పవన్ సందేశమిచ్చాడు. కఠినంగా శ్రమిస్తేనే విజయం సొంతమవుతుందని చెప్పాడు. ఈ రెండో పార్ట్ లో పవన్ పొలిటికల్ కామెంట్స్ కూడా చాలానే చేశాడు. ఫిబ్రవరి 10న ఈ రెండో పార్ట్ స్ట్రీమ్ కానుంది. మరి ఈ పార్ట్ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.,