ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్‌లోని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా మంచి క్రేజ్ ఉంది. హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాల తర్వాత ఆ మూవీని పవన్ చేయనున్నారు. అయితే, ప్రస్తుతం డిప్యూటీ సీఎం విధుల్లో బిజీగా ఉన్న ఆయన సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. మే 9న విడుదల కావాల్సిన హరి హర వీరమల్లు చిత్రం వాయిదా పడింది. ఓజీ విషయంలోనూ ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. ఈ తరుణంలో, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ విషయంలో తాజాగా బజ్ బయటికి వచ్చింది.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం పవన్ కల్యాణ్ రూ.170కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారంటూ ప్రస్తుతం బజ్ నడుస్తోంది. ఆ రేంజ్లో భారీ మొత్తం అందుకోనున్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ ఊహాగానాలే నిజమైతే తెలుగు ఇండస్ట్రీలో ఓ చిత్రానికి అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా పవన్ రికార్డు సృష్టిస్తారు. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు
పవన్ కల్యాణ్ ముందుగా హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఈ చిత్రానికి మరికాస్త షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మే 9 నుంచి ఈ మూవీ వాయిదా పడగా.. త్వరలోకే కొత్త డేట్ వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ఓజీ షూటింగ్‌ను కూడా ఇదే ఏడాదిలో ఫినిష్ చేయాలని పవన్ అనుకుంటున్నట్టుగా సమాచారం.
పవన్ బిజీగా ఉండటంతో అసలు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా ఓ దశలో తలెత్తాయి. అయితే, ఈ చిత్రం ఉంటుందనేలా మళ్లీ సమాచారం వస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. తమిళ మూవీ ‘తేరి’కి రీమేక్‌గా ఉంటుందనే టాక్ ఉంది. కానీ దీనిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఉస్తాద్ భగత్ సింగ్‌లో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా నుంచి కొంతకాలంగా ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు.
ప్రస్తుతం హరి హర వీరమల్లు చిత్రం కోసం పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మే 9 నుంచి వాయిదా పడిన ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి ఉంది. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టాక వచ్చే తొలి చిత్రం ఇదే కానుంది. ఈ పీరియడ్ యాక్షన్ సినిమాకు తొలుత దర్శకత్వం చేసిన డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నారు. ప్రస్తుతం ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రానున్న ఓజీ చిత్రానికి కూడా క్రేజ్ ఏ రేంజ్లో ఉంది. ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కనిపించనున్నారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది.
సంబంధిత కథనం