పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత పవన్ నుంచి విడుదల కానున్న తొలి మూవీ ఇదే కానుండటంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ మూవీకి తొలుత డైరెక్టర్ క్రిష్ కొంత భాగం దర్శకత్వం వహించగా.. ప్రస్తుతం జ్యోతి కృష్ణ డైరక్షన్ చేస్తున్నారు. హరి హర వీరమల్లు సినిమా నుంచి నేడు (ఫిబ్రవరి 21) రెండో పాట ప్రోమో రిలీజ్ అయింది.
హరి హర వీరమల్లు చిత్రంలోని కొల్లగొట్టినాదిరో పాట ప్రోమో నేడు వచ్చేసింది. “కోరకోర మీసాలతో.. కొదమ కొదమ అడుగులతో” అంటూ అదిరే పదాలతో పాట ప్రోమో మొదలు కాగా.. పవన్ కల్యాణ్ ఓ కర్ర పట్టుకొని సూపర్ ఎంట్రీ ఇచ్చారు. “కొంటె.. కొంటె చమకులతో.. కొలిమి లాంటి మగటిమితో.. సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటివాడు” అంటూ మంచి బీట్‍తో ఈ పాట సాగింది. పవన్ కల్యాణ్ స్వాగ్‍తో అలా కర్ర తిప్పుతూ అదిరిపోయే లుక్‍తో ఉన్నారు. అనసూయ భరద్వాజ్, పూజిత ఈ పాట ప్రోమోలో కనిపించారు. పవర్‌ఫుల్ పదాలతో ఈ ప్రోమో ఉంది.
హరి హర వీరమల్లులో ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మంచి ఊపున్న బీట్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. డ్యాన్స్ నంబర్‌గా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ పాటను మంగ్లి, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామినీ ఘంటశాల పాడారు. ప్రోమోలో మంగ్లీ వాయిస్ ఉంది. ఈ పాటకు చంద్రోబోస్ లిరిక్స్ అందించారు.
హరి హర వీరమల్లు నుంచి కొల్లగొట్టినాదిరో అనే ఈ రెండో పాట ఫిబ్రవరి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానుంది. ప్రోమోలో ఈ డేట్, టైమ్ రివీల్ అయింది. ఈ పాట జానపదం లాంటి బీట్‍తో పవన్, హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య డ్యుయెట్‍గా ఉండనుందని తెలుస్తోంది.
హరి హర వీరమల్లు చిత్రాన్ని మార్చి 28వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ అప్పటికే ప్రకటించింది. అయితే, వాయిదా రూమర్లు కూడా ఉన్నాయి. మొఘలుల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‍కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. బాబీ డియోల్, విక్రమ్‍జీత్ విర్క్, నోరా ఫతేహి కీరోల్స్ పోషిస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్‍లో హరి హర వీరమల్లు మూవీ రానుంది. ఐదేళ్ల నుంచి సాగుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నారు. ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని దయాకర్ రావు నిర్మిస్తుండగా.. ఏఎం రత్నం సమర్పకుడిగా ఉన్నారు.
సంబంధిత కథనం