Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ కన్ఫార్మ్
పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు ( Hari Hara Veera Mallu) రిలీజ్ డేట్‌పై నిర్మాత ఏ.ఎమ్ రత్నం క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఆదివారం వెల్లడించారు.
Hari Hara Veera Mallu Release Date : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వినిపించాడు నిర్మాత ఏ.ఎమ్.రత్నం. హరిహరవీరమల్లు సినిమా రిలీజ్ డేట్‌ను ఆదివారం వెల్లడించాడు. పీరియాడికల్ యాక్.న్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇందులో మొఘలుల కాలం నాటి బందిపోటు దొంగగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. రెండు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో ఈ కథ సాగుతుందని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలపై దృష్టిపెట్టడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలపై చిత్ర నిర్మాత ఏ.ఎమ్ రత్నం క్లారిటీ ఇచ్చాడు.
హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ నిలిచిపోయినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అన్నాడు. బిగ్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియాడిక్ సినిమా కావడంతోనే షూటింగ్ ఆలస్యమవుతున్నట్లు చెప్పాడు. 2023 మార్చి 30న హరిహరవీరమల్లు సినిమాను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. పాన్ ఇండియన్ సినిమా ఇదని, పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఏ.ఎమ్ రత్నం అన్నాడు.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ కనిపించబోతున్నది. జాతీయ అవార్డు గ్రహీత తోట తరణి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో పవన్ కళ్యాణ్ పై జూన్ నెలలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు.