Gabbar Singh Re Release: ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ రీ రిలీజ్‌కు రెడీ - బండ్ల గ‌ణేష్ ట్వీట్ వైర‌ల్‌-pawan kalyan gabbar singh to re release in theatres on march
Telugu News  /  Entertainment  /  Pawan Kalyan Gabbar Singh To Re Release In Theatres On March
ప‌వ‌న్ క‌ళ్యాణ్
ప‌వ‌న్ క‌ళ్యాణ్

Gabbar Singh Re Release: ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ రీ రిలీజ్‌కు రెడీ - బండ్ల గ‌ణేష్ ట్వీట్ వైర‌ల్‌

04 February 2023, 9:30 ISTNelki Naresh Kumar
04 February 2023, 9:30 IST

Gabbar Singh Re Release: ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ల‌లో ఒక‌టిగా నిలిచిన గ‌బ్బ‌ర్ సింగ్ మ‌రోసారి థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా రీ రిలీజ్‌పై నిర్మాత బండ్ల గ‌ణేష్ ట్విట్ట‌ర్‌లో ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

Gabbar Singh Re Release: ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ రీ రిలీజ్ కానుంది. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా వ‌చ్చే నెల‌లో మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి రాబోతున్న‌ది. ఈ సినిమా రీ రిలీజ్ డేట్‌పై నిర్మాత బండ్ల గ‌ణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

మే 11న గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా 4కే డిజిట‌ల్ డాల్బీ ఆట్మోస్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు బంగ్ల గ‌ణేష్ స్పందించాడు. మార్చి బెట‌ర్ బ్ర‌ద‌ర్ అంటూ పేర్కొన్నాడు. బండ్ల గ‌ణేష్ ఆన్స‌ర్ చూస్తుంటే మార్చిలో గ‌బ్బ‌ర్ సింగ్‌ను రీ రిలీజ్ కానున్న‌ట్లు తెలుస్తోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అత‌డి సూప‌ర్ హిట్ సినిమాల్ని వ‌రుస‌గా రిలీజ్ చేస్తోన్నారు. ఇప్ప‌టికే జ‌ల్సా, ఖుషి రీ రిలీజై భారీగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాయి. ఫిబ్ర‌వ‌రి 18న బ‌ద్రి సినిమా రీ రిలీజ్ కానుంది. తాజాగా గ‌బ్బ‌ర్ సింగ్ రీ రిలీజ్ కాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

హ‌రీష్‌ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా 2012లో రిలీజైంది. దాదాపు 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 150 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాలీవుడ్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. స‌ల్మాన్‌ఖాన్ హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ ద‌బాంగ్‌కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

పోలీస్ ఆఫీస‌ర్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్‌తో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా చేస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న‌ సినిమా ఇది. త్వ‌ర‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

క్రిష్ ద‌ర్వ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. అలాగే సాహో ద‌ర్శ‌కుడు సుజీత్‌తో ఓ గ్యాంగ్‌స్ట‌ర్ సినిమా చేయ‌నున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.